Toilet Tax: హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘‘టాయిలెట్ ట్యాక్స్’’ గందరగోళం..
- హిమాచల్‌లో ‘‘టాయిలెట్ ట్యాక్స్’’ రగడ..
- కాంగ్రెస్ ప్రభుత్వం పన్ను విధిస్తున్నట్లు వార్తలు..
- అలాంటిదేం లేదని సీఎం సుఖూ క్లారిటీ..
- కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్న బీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toilet Tax: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ‘‘ టాయిలెట్ ట్యాక్స్’’ సంచలనంగా మారింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై టాయిలెట్ ట్యాక్స్ విధిస్తుందనే వార్తల నేపథ్యంలో గందరగోళం నెలకొంది. అయితే, దీనిపై సీఎం సుఖ్వీందర్ సుఖూ స్పందించారు. రాష్ట్రొలో అలాంటి ట్యాక్స్ ఏం లేదని సమాధానం ఇచ్చారు. హిమాచల్ ప్రభుత్వం పట్టణ నివాసితులపై ప్రతీ టాయ్‌లెట్ సీటుకి రూ. 25 పన్ను విధిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నివేదికలన్నీ కూడా నిరాధారమైనవిగా సుఖూ పేర్కొన్నారు. రూ. 100 వాటర్ ఛార్జీలో ‘ టాయిలెట్ పన్ను’ ప్రతీ నివాసానికి 25 శాతంగా ఉంటుందని నివేదిక పేర్కొంది.
Read Also: Hydrogen Train: త్వరలో పట్టాలెక్కనున్న హైడ్రోజన్ రైలు.. ఏ ఏ మార్గాల్లో నడవనుందంటే..?
Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
పట్టణ భవనంలో టాయిలెట్ సీట్ల సంఖ్య ఆధారంగా ఛార్జీలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్న ఆరోపణలపై హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందిస్తూ, అలాంటి అదనపు సెస్ విధించలేదని చెప్పారు. టాయిలెట్ ట్యాక్స్ గురించి మీడియాలో కథనాలు రావడంతో ఒక్కసారిగా రాజకీయ గందరగోళం నెలకొంది. “ఈ నోటిఫికేషన్ సెప్టెంబర్ 21న జారీ చేయబడింది. మురుగునీటి పారుదల ఛార్జీలకు సంబంధించి జారీ చేసిన నోటిఫికేషన్ అదే రోజు ఉపసంహరించబడింది. దీనిపై డిప్యూటీ సీఎం తరఫున అభ్యంతరం వ్యక్తం చేశారు. సిమ్లాలో ఇప్పటికే మురుగునీటి ఛార్జీలు వసూలు చేయబడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో, ఇది హోటళ్లు మరియు కొన్ని సంస్థలకు వర్తిస్తుంది. త్వరలో కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నారు’’ అని హిమాచల్ ప్రదేశ్ అదనపు ప్రధాన కార్యదర్శి ఓంకార్ శర్మ తెలిపారు.
అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడింది. ఈ పన్నుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు వివిధ బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘నమ్మలేనిది, ఇదే నిజమైతే! పీఎం (నరేంద్ర) మోడీ జీ స్వచ్ఛతను ప్రజా ఉద్యమంగా నిర్మిస్తుండగా, ఇక్కడ కాంగ్రెస్ ప్రజలు మరుగుదొడ్ల కోసం పన్నులు వేస్తున్నారు! వారి కాలంలో వారు మంచి పారిశుధ్యం అందించనందుకు సిగ్గుపడాలి, కానీ ఈ చర్య దేశం సిగ్గుపడుతుంది.’’ అని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ కూడా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై నిరంతరం కొత్త పన్నులు, ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు. ఇది హిమాచల్ ప్రభుత్వ ఆర్థిక దివాలా, విధానపరమైన దివాలా, మానసిక దివాలాను ప్రతిబింబిస్తోందని అన్నారు.
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!