DK Aruna: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బీజేపీ మహిళ మోర్చ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖతో నాకు మంచి అనుబంధం ఉంది.. గతంలో ఇద్దరం కలిసి మంత్రులుగా పని చేశాం.. కానీ ఓ సినీ కుటుంబంపై ఆమె చేసిన ఆరోపణలు అభ్యంతకరంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. సినిమా ఇండ్రస్టీలో ఆ కుటుంబానికి ప్రత్యేక పేరు ఉంది.. ఎవరి వ్యక్తిగత విషయాలతో రాజకీయాలు ముడి పెట్టడం సరికాదు అని బీజేపీ ఎంపీ సూచించారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి అని డీకే అరుణ తెలిపారు.
Read Also: Israel-Iran War: ఇరాన్ చమురు, గ్యాస్ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేయొచ్చంటూ వార్తా కథనాలు
ఇక, ఒకసారి మాట్లాడి మళ్లీ వెనక్కు తీసుకోలేమని మాజీమంత్రి, బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. రాజకీయ నాయకులు ఆవేశం వచ్చినా ఆలోచించి మాట్లాడాలి.. ఒకరి మీద కోపం ఇంకొకరి మీద తీయడం సరికాదు అని చెప్పారు. ఒక మహిళను పట్టుకొని, సినిమా కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడం కరెక్ట్ కాదు అని పేర్కొన్నారు. అలాగే, భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆగ్రహానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురి కావొద్దు అని తెలిపారు. అమ్మవారి ఆలయం దగ్గర మహిళలు బతుకమ్మ ఆడటానికి కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది.. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ నియంతృత్వ పాలనా కొనసాగుతుందని డీకే అరుణ చెప్పుకొచ్చారు.