Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన ట్వీట్ చేశారు. రోడ్లపై నమాజ్ చేయడాని ప్రజల్ని అనుమతించొద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ని కోరారు. రోడ్లపై నమాజ్ చేయడానికి ప్రజల్ని అనుమతిస్తే, అది హనుమాన్ చాలీసా చదివేంచేలా ప్రోత్సహిస్తుందని వార్నింగ్ ఇచ్చారు. మన వీధుల్లో ప్రజల దైనందిత జీవితానికి అంతరాయం కలిగించే, మతపరమైన ఆచార స్థలాలుగా మార్చడానికి మేము అనుమతించమని సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
Hemant Soren: తనపై అసత్య ప్రచారం చేసేందుకు బీజేపీ భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతోందంటూ ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఆరోపణలు చేశారు. ప్రజల్లో విద్వేషాన్ని రగిల్చేందుకు యత్నిస్తోందన్నారు.
వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్టుకు NOC సాధించామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ ప్రజల కళ నెరవేరబోతుందన్నారు. 8 నెలల్లో పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నామన్నారు. 250 ఎకరాల ప్రభుత్వ భూమి ఎయిర్ పోర్టు కోసం ప్రభుత్వం కేటాయించిందని, డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి పౌర విమానయాన శాఖ మంత్రిని కలుస్తామన్నారు.
మహారాష్ట్ర, జార్ఖండ్లో ప్రచార హోరు ముగిసింది. గత కొద్దిరోజులుగా నాయకులు ప్రచారాన్ని హోరెత్తించారు. రాత్రి, పగలు తేడా లేకుండా అభ్యర్థులంతా ఓటర్లను దర్శనం చేసుకున్నారు.
సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదన్నారు. సీఎం రేవంత్ని వ్యతిరేకించిన అది పార్టీ కోసమే కానీ వ్యక్తిగతం కాదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంత నారాజ్ ఉన్నారు... ఆ విషయం తెలుసు అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్పచేస్తే కేసులు పెట్టండి.. అలాగని దొంగ కేసులు పెడితే మేం ఊరుకోం అని హెచ్చరించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఆర్కే రోజా.. మీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్నారని విమర్శించారు.. మహిళలపై నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారు.. ఫిర్యాదు చేస్తే రిప్లే ఇవ్వడానికే వందసార్లు ఉన్నత అధికారులతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు..
Kailash Gahlot: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆప్లో కీలక నేత కైలాశ్ గహ్లోట్ ఈ రోజు (సోమవారం) బీజేపీలో జాయిన్ అయ్యారు.
Arvind Kejriwal: మాజీ మంత్రి కైలాష్ గహ్లోట్ బీజేపీలో చేరడంపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు (సోమవారం) మాట్లాడుతూ.. గహ్లోట్ తన స్వంత నిర్ణయాలు తీసుకోగలరు.. అతను స్వేచ్ఛగా ఉన్నాడు.. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లవచ్చని అన్నారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మహారాష్ట్రాలో ఇద్దరు కోటీశ్వరులతో పేద ప్రజలు పోటీ పడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ధారావి మ్యాప్, గౌతమ్ అదానీ, నరేంద్ర మోడీల ఫొటోను ఆయన ఆవిష్కరించారు. అందులో మోడీ అంటే ఇదేనేమో.. ఒకటి ఉంటే మరోకటి సురక్షితం అని ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వ వైఫల్యాలే ఆంధ్రప్రదేశ్లో నేరాలు పెరగడానికి కారణం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు హోంమంత్రి వంగలపూడి అనిత.. శాసన మండలిలో ఆమె మాట్లాడుతూ.. గతంలో మహిళలపై అఘాయిత్యాలు జరిగితే జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. వైసీపీ హయాంలో పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారని గుర్తుచేసుకున్నారు..