తెలంగాణలో బీజేపీ ప్రస్తావన లేకుండా మిగతా పార్టీలు పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థి వచ్చిందా? మీతో దోస్తీ అంటే... మీతోనే దోస్తీ అంటూ... కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పరం విమర్శించుకుంటూ... బీజేపీ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాయా? తెలంగాణ కమలనాథులు దీన్ని తమ బలంగా ఫీలవుతున్నారా? కాషాయం కేంద్రంగా తెలంగాణ రాజకీయం ఎలా టర్న్ అవుతోంది?
Exit Polls: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అన్ని సర్వే సంస్థలు కూడా ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ కూటమి అధికారం చేపడుతుందని చెప్పాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బీజేపీ కూటమినే అధికారం వస్తుందని అంచనా వేశాయి.
జార్ఖండ్‌లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి దాదాపు 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ బూత్‌లకు తరలివచ్చారు.
సూపర్-6 హామీల విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు అబద్ధాలు కొనసాగుతూ వస్తున్నాయన్నారు.సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ఉండటానికి మాత్రమే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ ఉప ఎన్నికల వేఠ ఆ రాష్ట్రంలోని కర్హల్‌లోని కంజారా నది వంతెన సమీపంలో ఒక దళిత యువతి నగ్న మృతదేహం గోనె సంచిలో లభించడం సంచలనంగా మారింది. ప్రశాంత్ యాదవ్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు, ఈ నేరం వెనక రాజకీయ ఉద్దేశ్యం ఉన్నట్లు యువతి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఒక్క ఓటు కూడా వృథా కానప్పుడే సంపూర్ణ ఫలితాలు వస్తాయన్నారు. యూపీలోని ఓటర్లు తమ ఓటు హక్కును 100 శాతం వినియోగించుకునేందుకు తమ ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారని చెప్పుకొచ్చారు.
Jharkhand Elections: రేపు జార్ఖండ్ చివరి దశ ఎన్నికలు జరగబోతున్నాయి. జార్ఖండ్‌లోని 38 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరుగనున్నాయి అయితే, ఇప్పుడు బీహార్ పూర్నియా నుంచి పోటీ చేసి గెలుపొందిన ‘‘పప్పూ యాదవ్’’ ప్రచారం వైరల్‌గా మారింది. ఇండియా కూటమి తరుపున ఓట్లు అడుగుతున్న ఆయనకు స్థానికుల నుంచి చేదు అనుభవం ఎదురైంది.
BJP: ముంబైలోనివి ప్రాజెక్టుపై శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) అబద్ధాలను బట్టబయటు చేసిందని బీజేపీ నేత అమిత్ మాల్వియా ఈ రోజు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పవార్ వ్యాఖ్యలు ‘‘ ముంబై, మహారాష్ట్రలను తప్పుదోవ పట్టించడానికి ఉద్ధవ్ ఠాక్రే, రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారని స్పష్టం చేస్తున్నాయి.’