Rahul Gandhi: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరో రెండు రోజుల్లో ముగియబోతోంది. ఇదిలా ఉంటే, ఆ రాష్ట్రంలో ప్రధాన నాయకుల బ్యాగుల్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తున్నారు. ప్రచారం నిర్వహించే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ఇతర ప్రధాన పార్టీల కీలక నేతల లగేజీ చెక్ చేస్తున్నారు. తాజాగా శనివారం, మహారాష్ట్రలోని అమరావతికి వచ్చిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బ్యాగుల్ని ఎన్నికల సంఘం తనిఖీ చేసింది. ఇండియా కూటమి నేతల్ని మాత్రమే ఈసీ టార్గెట్ చేస్తుందనే…
Mutton Curry: మటన్ ముక్కుల కొట్లాటకు దారి తీసింది. ఉత్తర్ ప్రదేశ్ మీర్జాపూర్లో బీజేపీ ఎంపీ వినోద్ బింద్ ఏర్పాటు చేసిన విందులో ఈ గలాటా జరిగింది. నవంబర్ 14న జరిగిన ఈ విందు కార్యక్రమం తీవ్ర గందరగోళానికి దారి తీసింది. వెయ్యి మందికి పైగా ఆహ్వానించినప్పటికీ, హాజరైన వారు కేవలం గ్రేవీని మాత్రమే వడ్డించడం చూసి ఆశ్చర్యపోయారు. మటన్ ముక్కలు లేకుండా గ్రేవీ మాత్రమే వడ్డించడంపై అతిథులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుట్టం బేగం పేట భూములను ఔరంగజేబు ఆక్రమించుకున్నారని బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సుప్రీం కోర్టు మాట ఎవరైనా వినాల్సిందే అన్నారు.. కొందరు నేతలు గడ్డం పెంచుకుని రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతారని.. అందులో ఖాళీ పేజీలు ఉంటాయన్నారు. భారత సైన్యం వేషం వేసుకుని గుర్రాల మీద బీజేపీ ఆఫీస్‌కు వచ్చారన్నారు.
తెలంగాణలో అమృత్ టెండర్స్‌లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్నాయి బీఆర్ఎస్, బీజేపీ. ముఖ్యమంత్రి తనకు కావాల్సిన వాళ్ళకే కాంట్రాక్టులు కట్టబెట్టారన్నది విపక్షాల ప్రధాన అభియోగం. ఈ క్రమంలోనే.. తానము ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేస్తానంటూ విమానం ఎక్కారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. దాంతో ఢిల్లీలో ఏదో జరగబోతోందంటూ ఓ రేంజ్లో హైప్ వచ్చింది.
Liquor Shops Closed: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎక్సైజ్ అధికారుల దోపిడిని ఆరికట్టాలంటూ కన్నడ రాష్ట్రంలో లిక్కర్ షాప్స్ ఓనర్స్ ఆందోళన బాట పట్టబోతున్నారు. ఈ సందర్భంగా కర్ణాటకలోని మద్యం దుకాణాలు నవంబరు 20వ తేదీన మూత పడబోతున్నాయి.
Congress: రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బడిముబ్బడిగా హామీల వర్షం కురిపించింది. అయితే, ఇప్పుడు ఈ హామీల వల్ల ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొత్త పన్నులు విధించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక సర్కార్ ప్రతిపాదించిన ‘‘గ్రీన్ సెస్’’ ముసాయిదా రూపొందించకముందే రాజకీయంగా కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడింది.
జార్ఖండ్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో దశ ఎన్నికల పోలింగ్ కోసం జోరుగా ప్రచారం సాగుతోంది. ఫస్ట్ ఫేజ్‌లో 66 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. రెండో దశ ఓటింగ్ నవంబర్ 20న జరగనుంది.
వచ్చే ఏడాదే దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఆప్ అభ్యర్థి మహేశ్‌కుమార్ ఖిచి జయకేతనం ఎగరేశారు.