Maharashtra Elections 2024: మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిచేది ఎవరో రేపటితో తేలబోతోంది. అయితే, అన్ని ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా బీజేపీ నేతృత్వంలోని షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి ‘‘మహాయుతి’’ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది.
కాసేపటి క్రితం ముగిసిన పీఏసీ ఎన్నిక ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ సభ్యత్వాలకు ఓటింగ్ జరిగింది. సభ జరిగే సమయంలోనే బ్యాలెట్ పద్ధతిలో ఈ పోలింగ్ నిర్వహించారు. టీడీపీ తరపున ఏడుగురు సభ్యులు నామినేషన్లు వేశారు. జనసేన తరపున పులవర్తి రామాంజనేయులు.. బీజేపీ తరపున విష్ణుకుమార్రాజు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఎన్నికలో కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరిగాయి. అనంతరం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. అన్ని సర్వేల్లోనూ ఎన్డీఏ కూటమిదే విజయమని తేల్చాయి. అయితే ఈ సర్వేలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు.
Rahul Gandhi: అదానీ వ్యవహారం మరోసారి దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీతో సహా అతడి మేనల్లుడు సాగర్ అదానీ మరికొందరు 2020-2024 మధ్యాలంలో రూ. 2,029 కోట్లు అంచాలు ఇచ్చారని అమెరికా న్యాయవాదులు ఆరోపించారు. ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్ ఖండించింది.
మమతా బెనర్జీ ప్రభుత్వంలో మరో ఘోరం వెలుగుచూసింది. ఓ ప్రభుత్వాస్పత్రిలో అప్పుడే పుట్టిన పసికందును ఓ కుక్క నోటితో కరుచుకుని ఎత్తుకెళ్లిపోయింది. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్లోని బంకురా జిల్లాలో చోటుచేసుకుంది.
Gautam Adani: అదానీ గ్రూపుపై అమెరికా లంచం ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. గౌతమ్ అదానీపై అమెరికా ప్రాసిక్యూటర్లు లంచం, మోసానికి పాల్పడ్డారని అభియోగాలు మోపింది.
Maharashtra Elections: మహారాష్ట్ర ఎన్నికలు ముగిశాయి. 288 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’ కూటమి గెలుస్తుందని అంచనా వేశాయి. ఇదిలా ఉంటే, ఇంకా ఫలితాలు రాకముందే ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో సీఎం అభ్యర్థిపై కొట్లాట మొదలైంది.
BJP: సోలార్ ఒప్పందాల కోసం అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. అయితే, అదానీ గ్రూప్ నుంచి లంచాలు అందుకున్న రాష్ట్రాలు ప్రతిపక్షాల పాలనలో ఉన్నాయని బీజేపీ పేర్కొంది.
గౌతమ్ అదానీ.. భారతీయ, అమెరికా చట్టాలను ఉల్లంఘించినట్లు తెలుస్తుందన్నారు. మోడీ, అదానీ కలిసి ఉంటే.. ఆ ఇద్దరూ ఇండియాలో క్షేమంగా ఉంటారని ఆయన ఆరోపించారు. అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
తెలంగాణలో బీజేపీ ప్రస్తావన లేకుండా మిగతా పార్టీలు పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థి వచ్చిందా? మీతో దోస్తీ అంటే... మీతోనే దోస్తీ అంటూ... కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పరం విమర్శించుకుంటూ... బీజేపీ గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాయా? తెలంగాణ కమలనాథులు దీన్ని తమ బలంగా ఫీలవుతున్నారా? కాషాయం కేంద్రంగా తెలంగాణ రాజకీయం ఎలా టర్న్ అవుతోంది?