Uddhav Thackeray: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ‘‘మహాయుతి’’ ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ కూటమి 233 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. విపక్ష కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ దారుణ పరాజయం పాలైంది. ఈ కూటమి కేవలం 46 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఉద్ధవ్ శివసేన 20, ఎన్సీపీ శరద్ పవార్ 10, కాంగ్రెస్ 16 సీట్లను…
భారత స్వాతంత్య్ర ఉద్యమం ప్రజాస్వామ్య గళం.. దాని నుంచి ఉద్భవించిందే రాజ్యాంగం అన్నారు. ఇది కేవలం డాక్యుమెంట్ కాదు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మౌలానా ఆజాద్ లాంటి లాంటి వారు ఎంతో మంది ఎన్నో ఏళ్ల పాటు పోరాటం చేశారని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
Constitution Debate: భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75 సంవత్సరాలు అయినా సందర్భంగా పార్లమెంటులోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చ కొనసాగనుంది. ఈరోజు (డిసెంబర్ 13) లోక్సభలో ఉదయం జీరో అవర్ ముగిసిన తర్వాత కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీనిని స్టార్ట్ చేయనున్నారు.
Parliament: ‘‘ వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లు’’కి గురువారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సమావేశాల్లోనే బిల్లుని పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే, డిసెంబర్ 13-14 తేదీల్లో పార్లమెంట్ సమావేశాలకు తప్పకుండా హాజరుకావాలని బీజేపీ తన ఎంపీలకు ‘‘త్రీ లైన్ విప్’’ జారీ చేసింది. ఉభయసభల్లో ముఖ్యమైన చర్చలకు హాజరుకావాలని కోరింది. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేబినెట్ ‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’’ బిల్లుని ఆమోదించిన తర్వాత ఇది జరిగింది.
Loksabha: పార్లమెంట్ లో ఈరోజు (డిసెంబర్ 12) కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభ ప్రారంభమైన క్షణం నుంచి అధికార, విపక్ష ఎంపీలు ఆందోళన బాట పట్టారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ వాయిదా వేశారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హస్తిన పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు.
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడినా.. రాజకీయ పరిస్థితుల మాత్రం ఇంకా సద్దుమణగలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన 12 రోజులకు ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి వరకు ముఖ్యమంత్రి పదవిపై మహాయుతి కూటమిలో తీవ్ర పంచాయితీ జరిగింది.
Maharashtra Cabinet: మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణపై ఉత్కంఠ కొనసాగుతుంది. హోంశాఖ కావాలని పట్టుబట్టిన శివసేన (షిండే) వర్గానికి ఆ పదవి దక్కడం లేదని ప్రచారంతో ఆయన ఆర్థిక రాజధాని ముంబైని వదిలి పెట్టినట్లు తెలుస్తుంది.