జమిలి బిల్లును ప్రవేశ పెడుతూ కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తీసుకొచ్చిన తీర్మానంపై లోక్సభలో ఓటింగ్ జరిగింది. కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో దీన్ని చేపట్టారు. దీనికి 269 మంది బిల్లు ప్రవేశ పెట్టేందుకు అనుకూలంగా ఓటు వేయగా.. 198 మంది వ్యతిరేకించారు.
Congress: లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ నోటీసు ఇచ్చారు. రూల్ ఆఫ్ ప్రొసీజర్లోని రూల్ 72 ప్రకారం రాజ్యాంగం (129) సవరణ బిల్లు 2024 ప్రవేశ పెట్టొద్దని డిమాండ్ చేశారు.
Jamili Elections: వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును లోక్సభలో ఈరోజు ప్రవేశ పెట్టనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలు తమ ఎంపీలకు ఇప్పటికే త్రీ లైన్ విప్ జారీ చేశాయి. ఎంపీలంతా సభకు హాజరుకావాలని కోరాయి.
Draupadi Murmu: మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం ఈరోజు (డిసెంబర్ 17) జరగనుంది. దీనికి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి ఎయిమ్స్లో కట్టుదిట్టమైన భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు.
One Nation One Election: లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లు ఈరోజు (డిసెంబర్ 17) పార్లమెంటు ముందుకు రాబోతుంది.
One Nation One Election Bill Live UPDATES: లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ (129) సవరణ బిల్లును ఈరోజు లోక్ సభలో ప్రవేశ పెట్టనుంది.
పంజాబ్ బీజేపీ చాలా మంది నేతలపై చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా మాజీ క్యాబినెట్ మంత్రితో సహా డజను మంది నాయకులను 6 సంవత్సరాల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. వేటు పడిన వారిలో భగత్ చున్నీలాల్ కూడా ఉన్నారు. ఆయన పంజాబ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.
పార్లమెంట్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఆమె బ్యాగ్ వేసుకుని రావడాన్ని ముస్లింల బుజ్జగింపు రాజకీయంగా బీజేపీ అభివర్ణించింది. కాంగ్రెస్ ఎంపీ ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని బీజేపీ ప్రశ్నించింది. ఆమె పాలస్తీనాకు సంఘీభావం తెలుపుతోంది..
బీజేపీ హైకమాండ్ ఎంపీలకు విప్ జారీ చేసింది. మంగళవారం ఎంపీలంతా లోక్సభకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 17, 2024న కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సభలో చర్చకు రానున్నందున పార్లమెంట్ సభ్యులంతా తప్పనిసరిగా హాజరుకావాలని స్పష్టం చేసింది.
జమిలి.. ఇప్పుడు దేశమంతా మార్మోగుతున్న పేరు. ఏ నాయకుడి నోట విన్నా.. ఏ రచ్చ బండ దగ్గర కూర్చున్నా.. ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఇంతగా జమిలి పేరు మార్మోగడానికి కారణం. మోడీ ప్రభుత్వం.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సరికొత్త రాజకీయ ఆలోచనకి పునాది.