జేపీసీ ఏర్పాటు ప్రక్రియ అనేది లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా పర్యవేక్షణలో జరగనుంది. అయితే, స్పీకర్ కు రాబోయే 48 గంటలు చాలా కీలకమైనవిగా చెప్పాలి.. ఎందుకంటే శుక్రవారం (డిసెంబర్ 20) సాయంత్రంలోగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. అప్పటి వరకు జేపీసీలోని సభ్యులు ఎవరెవరు అనేది ఓంబిర్లా ప్రకటించాల్సి ఉంది.
రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్ర నేత ఎల్కే. అద్వానీ (97) ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతోంది. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని.. ఒకటి లేదా రెండు రోజుల్లో ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకు తరలించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లును మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు కోసం బీజేపీ ఎంపీలకు సోమవారం హైకమాండ్ విప్ జారీ చేసింది.
విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. లగచర్లకు రైతులకు బేడీల అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. బీఆర్ఎస్, బీజేపీలు వాయిదా తీర్మానాల కోసం డిమాండ్ చేశాయి. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ శాసనసభ్యుల నిరసన మధ్య మూడు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
BJP New President: బీజేపీ కొత్త సంవత్సరంలో తమ నూతన సారథిని ఎన్నుకోనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి చివరికి ఆ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని కమలం పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు.
జమిలి బిల్లును ప్రవేశ పెడుతూ కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తీసుకొచ్చిన తీర్మానంపై లోక్‌సభలో ఓటింగ్ జరిగింది. కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో దీన్ని చేపట్టారు. దీనికి 269 మంది బిల్లు ప్రవేశ పెట్టేందుకు అనుకూలంగా ఓటు వేయగా.. 198 మంది వ్యతిరేకించారు.
Congress: లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ నోటీసు ఇచ్చారు. రూల్ ఆఫ్ ప్రొసీజర్‌లోని రూల్ 72 ప్రకారం రాజ్యాంగం (129) సవరణ బిల్లు 2024 ప్రవేశ పెట్టొద్దని డిమాండ్ చేశారు.
Jamili Elections: వన్ నేషన్- వన్ ఎలక్షన్ బిల్లును లోక్‌సభలో ఈరోజు ప్రవేశ పెట్టనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలు తమ ఎంపీలకు ఇప్పటికే త్రీ లైన్ విప్ జారీ చేశాయి. ఎంపీలంతా సభకు హాజరుకావాలని కోరాయి.
Draupadi Murmu: మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం ఈరోజు (డిసెంబర్ 17) జరగనుంది. దీనికి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి ఎయిమ్స్‌లో కట్టుదిట్టమైన భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు.
One Nation One Election: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన ఒకే దేశం-ఒకే ఎన్నిక బిల్లు ఈరోజు (డిసెంబర్ 17) పార్లమెంటు ముందుకు రాబోతుంది.