దేశ రాజధాని ఢిల్లీలో అనుమానిత బ్యాగ్ తీవ్ర కలకలం రేపింది. బీజేపీ ప్రధాన కార్యాలయం దగ్గర అనుమానిత బ్యాగ్ ప్రత్యక్షమైంది. దీంతో బీజేపీ శ్రేణులు పోలీసులకు సమాచారం అందించారు.
Jamili Election Bill: దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు తీసుకు వచ్చిన 129వ రాజ్యాంగ సవరణ (వన్ నేషన్- వన్ ఎలక్షన్) బిల్లును ఈరోజు (డిసెంబర్ 20) లోక్సభ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది.
మహారాష్ట్ర రాజకీయాల్లో గురువారం ఆసక్తికర పరిణామం జరిగింది. అజిత్ పవార్ గురించి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు. అజిత్ పవార్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారంటూ ఫడ్నవిస్ జ్యోసం చెప్పారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు ‘‘హత్యాయత్నం’’ కేసు పెట్టారు. మరోవైపు కాంగ్రెస్ కూడా బీజేపీ ఎంపీలపై కుట్ర, దుష్ప్రవర్తన కేసులను పెట్టింది. అమిత్ షా ‘అంబేద్కర్’ వ్యాఖ్యలపై ఈ రోజు పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Udhayanidhi Stalin: తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తాను మతసామరస్యాన్ని గౌరవిస్తానని ప్రకటించారు. తాను ‘‘క్రైస్తవుడినని గర్విస్తున్నాను’’ అని ప్రకటించుకుుంటూనే, అన్ని విశ్వాసాలను కలుపుకుని ముందుకు వెళ్తానని చెప్పారు. క్రిస్మస్ కార్యక్రమానికి హాజరైన ఉదయనిధి మాట్లాడుతూ.. విభజన, విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి కొందరు మతాన్ని ఉపయోగించుకున్నారని ఆరోపించారు.
BJP: కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన ‘‘ అంబేద్కర్ ’’ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతల్ని పెంచాయి. ముఖ్యంగా పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. దీనికి ప్రతిగా బీజేపీ కూడా అంతే ధీటుగా అంబేద్కర్ని అవమానించిన పార్టీ కాంగ్రెస్ అంటూ నిరసనలతో హోరెత్తించారు. ఇదిలా ఉంటే, పార్లమెంట్ ఆవరణలో ఎంపీలపై దాడి సంచలనంగా మారింది.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసింది. లోక్సభ నుంచి 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులను నియమించింది.