డా.బీఆర్ అంబేడ్కర్‌ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ అని రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. రాజ్యాంగం, అంబేడ్కర్‌ను బీజేపీ ఎన్నడూ అగౌరపరచదన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తుందని బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అంబేడ్కర్ తమ నాయకుడని చెబుతున్న కాంగ్రెస్.. ఎందుకు భారత రత్న ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. వాజ్‌పేయీ హయాంలో అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చిన ఘనత తమ పార్టీది అని పురందరేశ్వరి పేర్కొన్నారు. అంబేడ్కర్‌పై కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను…
కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి స్టైల్...కూటమిలో చర్చనీయాంశంగా మారింది. నిజం చెప్పాలంటే ఆదోని ప్రాంతంలో బీజేపీకి బలం లేదు. కూటమి పొత్తులో భాగంగా ఆదోని టికెట్ బీజేపీకి వెళ్లింది. దీంతో ఆ పార్టీ టికెట్ దక్కించుకుని పార్థసారథి గెలుపొందారు. గతంలోనూ టీడీపీ పొత్తులో ఆదోని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఎమ్మెల్యే పార్థసారథి వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారి తీస్తోందట.
బీజేపీ ఎందుకు...అల్లు అర్జున్‌కు సపోర్టు చేసేలా మాట్లాడుతుందనే చర్చ జనాల్లో జరుగుతోంది. మహిళ మరణించడం బాధాకరం అంటూనే...ఆ మహిళ కుటుంబాన్ని ప్రభుత్వం, అల్లు అర్జున్ పట్టించుకోవాలని కాషాయ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ రోజు ఆ సంఘటన జరిగి ఉండాల్సింది కాదని అంటున్న కమలం నేతలు...అనుమతి లేకున్నా అయనను ఎలా రోడ్ షో చేయించారని ప్రశ్నిస్తున్నారు.
ఒకే దేశం ఒకే ఎన్నికపై జేపీసీ తొలి సమావేశం తేదీ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 8న ఈ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఒక దేశం ఒకే ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. విపక్షాల గందరగోళం మధ్య ఈ బిల్లును జేపీసీ ఏర్పాటు చేశారు.
Daggubati Purandeswari : టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్పా-2’ చిత్రం విడుదల నేపథ్యంలో, థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్ళిన అల్లుఅర్జున్‌పై జరిగిన ఘటన గురించి బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె ప్రకాశంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా అల్లు అర్జున్ను అరెస్టు చేయడం సరైనదే కాదని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు ఈనెల 13వ తేదీన అరెస్టు…
మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పడింది. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా.. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మూడు పార్టీల నుంచి మంత్రులుగా ప్రమాణస్వీకారం కూడా చేశారు.
రాజ్యసభలో అంబేద్కర్‌పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే విపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నాయి. అమిత్ షాను బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.