Parliament scuffle: ఆ రోజు రాహుల్ గాంధీ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్‌లా ప్రవర్తించారు..
- కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ షడంగీ తీవ్ర విమర్శలు..
- డిసెంబర్ 19న రాహుల్ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్‌లా ప్రవర్తించారు..
- లోక్‌సభలో విపక్ష నేత ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం సరైనది కాదు: ఎంపీ ప్రతాప్‌చంద్ర షడంగీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament scuffle: డిసెంబర్ 19న పార్లమెంటు ఆవరణలో ఎంపీల మధ్య తోపులాట జరిగిన ఘటనలో బీజేపీ ఎంపీలు ప్రతాప్‌చంద్ర షడంగీ, ముకేశ్ రాజ్‌పూత్ గాయపడ్డారు. ఈ ఘటనపై తాజాగా గాయపడిన వారిలో ఒక ఎంపీ షడంగీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. పార్లమెంట్ ఆవరణలో తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే.. రాహుల్ ఒక ఎంపీలా కాకుండా బౌన్సర్‌లా ప్రవర్తించారని మండిపడ్డారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ లాంటి గొప్ప వ్యక్తులు లోక్‌సభలో విపక్ష నేతలుగా వ్యవహరించారు.. అలాంటి పదవిలో ఉన్న ఆయన ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదన్నారు. ఇక, తోపులాటలో గాయపడిన తాను డిసెంబరు 28వ తేదీన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉంది.. తలపై పడిన కుట్లు ఇంకా మానకపోవడంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని బీజేపీ ఎంపీ ప్రతాప్‌చంద్ర షడంగీ చెప్పారు.
Read Also: Rohit Sharma: రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. ఆ టెస్టు తర్వాతే రిటైర్మెంట్!
Also Read
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
అయితే, లోక్ సభలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్‌ను అమిత్‌షా అవమానించారని విపక్షాలు ఆందోళన చేశాయి. అదే సమయంలో కాంగ్రెస్సే అంబేద్కర్ ను అవమానిస్తోందంటూ మకరద్వారం మెట్లపై నిల్చొని ఎన్డీయే ఎంపీలు నిరసన చేశారు. అప్పుడే, ప్రతిపక్ష ఎంపీలూ ఆందోళన చేస్తున్నారు.. అప్పుడు పక్క నుంచి వెళ్లే ఛాన్స్ ఉన్నా.. మెట్లపై కూర్చున్న తమను తోసుకుంటూ రాహుల్ గాంధీ సభలోకి వెళ్లడానికి ట్రై చేశారని బీజేపీ ఎంపీలు ఆరోపించారు. ఈ దాడిలో బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. ఇక, ఈ ఆరోపణలను రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. తాను సభలోకి వెళ్తుంటే వారే అడ్డుగా వచ్చి నెట్టేశారని చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!