దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అధికార పార్టీ ఆప్ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తున్నారు. అంతేకాకుండా ఆయా వర్గాలపై ఎన్నికల వరాల జల్లులు కూడా కురిపిస్తున్నారు. ఇప్పటికే మహిళలకు నెలకు రూ.2,100 సాయం చేస్తామని ప్రకటించారు. అలాగే 60 ఏళ్లు దాటిన వృద్ధులకు అన్ని రకాల ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని వెల్లడించారు. తాజాగా అర్చకులపై కూడా వరాల జల్లు కురిపించారు.
ఇది కూాడా చదవండి: Harish Shankar: హరీష్ శంకర్ కి కొత్త టెన్షన్?
సోమవారం పూజారి గ్రంథి సమ్మాన్ యోజన పథకాన్ని మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రకటించారు. నెలకు రూ.18,000 ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ పథకం కింద దేవాలయాల పూజారులు, గురుద్వారాలోని ‘గ్రంథి’లకు నెలకు రూ.18,000 గౌరవ వేతనం అందజేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. వచ్చే ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘పూజారీ గ్రంథి సమ్మాన్ యోజన’ను ప్రారంభిస్తామని, దీని కింద ఆలయ పూజారులు, గురుద్వారాలకు నెలవారీగా రూ.18,000 గౌరవ వేతనం అందజేస్తామని అరవింద్ కేజ్రీవాల్ సోమవారం వివరించారు. మంచి, చెడు సమయాల్లో ప్రజల జీవితాల్లో పూజారులు, గ్రంథులు మంచి పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. ఈ స్థాయిలో వేతనం ఇవ్వడం దేశంలోనే ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. అర్చకులు ప్రాచీన ఆచారాలను ముందుకు తీసుకెళ్తున్నారని.. వారు తమ కుటుంబాన్ని కూడా పట్టించుకోరని తెలిపారు.
ఇదిలా ఉంటే కేజ్రీవాల్ ఇటీవల ప్రకటించిన పథకాలపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే. సక్సేనా విచారణకు ఆదేశించారు. అలాగే ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి నగదు తరలింపు ఏర్పాట్లను అడ్డుకోవాలని ఎల్జీ ఆదేశించారు.
ఇది కూాడా చదవండి: TTD: టీటీడీ ప్రతిపాదలనకు సీఎం గ్రీన్ సిగ్నల్.. తెలంగాణ ప్రజాప్రతినిధులకు గుడ్‌న్యూస్..