కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్లారు. కొత్త ఏడాదికి ముందు రాహుల్ విదేశీ పర్యటనకు వెళ్లడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవలే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయారు. కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది.
ఇది కూడా చదవండి: KTR: మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీ తీర్మానం.. కేటీఆర్ రియాక్షన్ ఇదే(వీడియో)
అయితే రాహుల్ విదేశీ పర్యటనపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దేశంలో సంతాప దినాలు జరుగుతుండగా.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ న్యూఇయర్ వేడుకలు జరుపుకునేందుకు విదేశాలకు వెళ్తారా? అంటూ బీజేపీ ధ్వజమెత్తింది. మన్మోహన్ చనిపోయి కొన్ని గంటలైనా గడవక ముందే విదేశాలకు ఎలా వెళ్తారంటూ బీజేపీ నిలదీసింది. మన్మోహన్‌కు సంతాపం వ్యక్తం చేయడం కంటే.. రాహుల్‌కి న్యూఇయర్ వేడుకలే ఎక్కువైపోయాయని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్ పోస్ట్‌లో విమర్శించారు. గాంధీ, కాంగ్రెస్ కుటుంబాలు సిక్కులను ద్వేషిస్తున్నాయని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Hyderabad Metro: నగర వాసులకు గుడ్ న్యూస్.. రేపు అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు
బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా తిప్పికొట్టింది. రాహుల్‌గాంధీ వ్యక్తిగత పర్యటన కోసం వియత్నాం వెళ్లారని.. న్యూఇయర్ వేడుకల కోసం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. మన్మోహన్ అంత్యక్రియల పట్ల కేంద్రం వ్యవహరించిన తీరును దారి మళ్లించేందుకే బీజేపీ రాజకీయ విమర్శలు చేస్తోందని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: OG OG అని అరుస్తుంటే బెదిరింపుల్లాగా అనిపిస్తున్నాయి!