Ashok Gajapathi Raju: గూగుల్ డేటా సెంటర్‌కు సింహాచలం భూముల కేటాయింపు.. అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashok Gajapathi Raju: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన భూములను గూగుల్ డేటా సెంటర్‌కు కేటాయించడంపై గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు స్పందించారు. విశాఖలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, అభివృద్ధి మరియు ఆధ్యాత్మికత మధ్య సమతుల్యత ఉండాలని అభిప్రాయపడ్డారు. అయితే, సింహాచలం భూముల కేటాయింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు.. “పెట్టుబడుల వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అది మంచి పరిణామమే. కానీ, అదే సమయంలో భక్తుల మనోభావాలను గౌరవించడం చాలా ముఖ్యం” అని ఆయన పేర్కొన్నారు. దేవుడికి భక్తులు సమర్పించిన భూములు కాబట్టి, వాటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భక్తుల నమ్మకాలకు లోబడి ఉండాలని హితవు పలికారు. గతంలో ప్రభుత్వ సంస్థలు తీసుకున్న భూములకు సంబంధించిన రికార్డులను కూడా నేటికీ అప్‌డేట్ చేయలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
Read Also: Vishwak Sen’s CULT Teaser: ‘కల్ట్’ టీజర్‌తో విశ్వక్ సేన్ ఊచకోత!
Also Read
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
మరోవైపు, ఇటీవల తిరుమల వేంకటేశ్వరస్వామి ఫోటోలతో ఎమ్మెల్సీలు చేసిన ప్రదర్శనపై అశోక్ గజపతిరాజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “దైవం పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా తప్పే. దేవుడిని రాజకీయాల్లోకి లాగడం బాధాకరం” అని అన్నారు. ప్రసాదాల నాణ్యత విషయంలో పూర్తి బాధ్యత పాలకమండలిదేనని, పారదర్శకత కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక, గత ఏడాది చందనోత్సవం సమయంలో జరిగిన అపశ్రుతులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు ఆయన తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు ఉండాలని అధికారులను కోరారు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు.
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!