Rahul Gandhi: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారక స్థలంపై వివాదం నెలకొంది. మాజీ ప్రధానిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. స్మారక చిహ్నం నిర్మించడానికి కేటాయించిన స్థలంలో ఆయన అంత్యక్రియలు చేయాలన్న కాంగ్రెస్ ప్రతిపాదనని తిరస్కరించడం ద్వారా బీజేపీ మన్మోహన్ సింగ్‌ని అవమానించిందని రాహుల్ గాంధీ శనివారం అన్నారు.
‘‘భారతదేశ గొప్ప కుమారుడు, సిక్కు సమాజానికి మొదటి ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ అంత్యక్రియల్ని నిగంబోధ్ ఘాట్‌లో ఈ రోజు నిర్వహించడం ద్వారా అవమానించింది’’ అని అంత్యక్రియలు పూర్తయిన కొన్ని గంటల తర్వాత రాహుల్ గాంధీ అన్నారు.
మాజీ ప్రధాని అంత్యక్రియలను ప్రత్యేక స్మారక స్థలంలో నిర్వహించాలని కాంగ్రెస్ శుక్రవారం కేంద్రాన్ని కోరింది. అయితే, ప్రభుత్వ శ్మశానవాటిక అయిన నిగంబోధ్ ఘాట్‌లో మృతదేహాన్ని దహనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది పెద్ద వివాదానికి కారణమైంది. ఢిల్లీలో మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం నిర్మించబడుతుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని ఆయన కుటుంబానికి తెలియజేసింది.
Read Also: Pushpa 2: పుష్ఫ 2 సినిమాలో ఓ ఊపు ఊపిన పాట.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేదోచ్..
మాజీ ప్రధానుల అంత్యక్రియలు సంప్రదాయబద్ధంగా నిర్దేశించిన శ్వశాన వాటికలో నిర్వహించబడుతున్నాయని, గౌరవప్రదంగా నివాళులర్పించేందుకు ప్రజలకు ప్రవేశం కల్పించాలని రాహుల్ గాంధీ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘మన్మోహన్ సింగ్ ఒక దశాబ్ధం పాటు దేశానికి ప్రధానిగా ఉన్నారు. అతని పదవీకాలంలో దేశం ఆర్థికంగా అగ్రరాజ్యంగా మారింది మరియు అతని విధానాలు ఇప్పటికీ దేశంలోని పేద మరియు వెనుకబడిన తరగతులకు మద్దతుగా ఉన్నాయి. ఇప్పటి వరకు, మాజీ ప్రధానులందరి గౌరవిస్తూ, వారి అంత్యక్రియలు అధీకృత శ్మశానవాటికలో నిర్వహించబడ్డాయి, తద్వారా ప్రతి వ్యక్తి ఎటువంటి అసౌకర్యం లేకుండా చివరి దర్శనం , నివాళులు అర్పించారు’’ అని చెప్పారు. ‘‘డాక్టర్ మన్మోహన్సింగ్ మన అత్యున్నత గౌరవం, స్మారకానికి అర్హుడు. దేశం గర్వించదగిన వ్యక్తికి ప్రభుత్వం గౌరవం చూపించి ఉండాలి’’ అని చెప్పారు.
మాజీ ప్రధాని అంత్యక్రియలపై బీజేపీ వర్సెస్ కాంగ్రస్‌గా పొలిటిక్ వివాదం మొదలైంది. పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా అవమానించిందని అన్నారు. అయితే, కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. దీనిని కూడా కాంగ్రెస్ రాజకీయానికి ఉపయోగిస్తుందని విమర్శించింది. స్మారక చిహ్నం కోసం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని చెప్పింది.