Daggubati Purandeswari : టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్పా-2’ చిత్రం విడుదల నేపథ్యంలో, థియేటర్లో సినిమా చూసేందుకు వెళ్ళిన అల్లుఅర్జున్‌పై జరిగిన ఘటన గురించి బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె ప్రకాశంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా అల్లు అర్జున్ను అరెస్టు చేయడం సరైనదే కాదని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు ఈనెల 13వ తేదీన అరెస్టు…
మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పడింది. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా.. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం మూడు పార్టీల నుంచి మంత్రులుగా ప్రమాణస్వీకారం కూడా చేశారు.
రాజ్యసభలో అంబేద్కర్‌పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే విపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నాయి. అమిత్ షాను బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
వయనాడ్‌లో ప్రియాంకాగాంధీ విజయాన్ని సమీప బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కేరళ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రియాంక నామినేషన్ పత్రాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని.. ఆమె కుటుంబ ఆస్తులు కూడా తప్పుగా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు.
BJP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందట అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ మాజీ ఎమ్మెల్యే సుఖ్బీర్ సింగ్ దలాల్ శనివారం బీజేపీలో చేరారు. ముండ్కా మాజీ ఎమ్మెల్యే అయిన దలాల్, ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా, కేంద్రమంత్రి హర్ష్ మల్హోత్రా, ఆశిసూద్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఆరు సార్లు ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు సర్దార్ బల్బీర్ సింగ్ కూడా కాషాయ పార్టీలో చేరారు. సచ్‌దేవా ఆయనను ఢిల్లీ…
పార్లమెంట్ దాడి ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని.. వాళ్ల నటనకు అవార్డులు ఇవ్వాల్సిందేనని జయా బచ్చన్ ఎద్దేవా చేశారు.
Parliament 'assault' case: పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా మారింది. రాహుల్ గాంధీ తమ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్‌పుత్‌లను నెట్టివేయడంతో వారు గాయపడినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ఇద్దరినీ చికిత్స నిమిత్తం ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో చేర్పించారు. సభలోకి వచ్చే ప్రయత్నంలో రాహుల్ గాంధీ తమను నెట్టారని బీజేపీ చెబుతోంది.
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం అంబేద్కర్ వివాదం నడుస్తోంది. ఇటీవల రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఈ మధ్య కొందరికీ అంబేద్కర్ ఫ్యాషన్ అయిపోయిందని.. అంబేద్కర్ బదులు.. భగవంతుని పేరు తలుచుకుంటే స్వర్గంలోనైనా పుణ్యం దక్కుతుందని వ్యాఖ్యానించారు.