దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 5న ఒకే విడతలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
ఈ రోజు (జనవరి 7) అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను 'చునావి (ఎన్నికల) ముసల్మాన్' అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలో పోస్టర్తో విడుదల చేసింది.
Delhi Elections 2025: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఈరోజు (జనవరి 7) ప్రకటించనుంది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్లో ఎలక్షన్ కమిషన్ విలేకరుల సమావేశం నిర్వహించి.. ఎన్నికల తేదీల వివరాలను వెల్లడిస్తుంది.
మరోసారి తనకు ముఖ్యమంత్రి పదవి ఎలా వచ్చింది అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, ప్రస్తుత బీజేపీ నేత నల్లారి కిరణ్కుమార్ రెడ్డి.. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. ఈ సందర్భంగా వివిధ అంశాలపై మాట్లాడారు.. నేను ముఖ్యమంత్రి పదవి ఎవరినీ అడగలేదు అన్నారు.. అందుకోసం ఎవరికీ కనీసం కప్పు టీ కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు.. కానీ, పదవి వచ్చినప్పుడు ప్రజలకు ఎలా మేలు చేయాలనేది ఆలోచించాను.. అంతేకాదు..…
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి ఎంతో చేయాలని ఉన్నా ఢిల్లీ పెద్దలు అడ్డుపడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ కలెక్టరేట్ ముందు సమగ్ర శిక్షణ దీక్షా శిబిరాన్ని కేఏ.పాల్ సందర్శించి మీడియాతో మాట్లాడారు.
Ramesh Bidhuri: బీజేపీ నేత రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆయన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాను గెలిస్తే, నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంకా గాంధీ చెంపల వలే స్మూత్గా చేస్తానని ఆదివారం కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలుపై వివాదం చెలరేగింది.
Alleti Maheshwar Reddy: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని, తాజా క్యాబినెట్ నిర్ణయాలు నిరాశకు గురిచేసినట్లు పేర్కొన్నారు. రైతు భరోసా పథకంపై స్పష్టత లేకపోవడం, పెన్షన్ పెంపు, ఆరు గ్యారంటీలపై ప్రభుత్వం పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: DaakuMaharaaj…
Ramesh Bidhuri: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ పార్టీల మధ్య మాటలు హద్దు మీరుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ బీజేపీ సీనియర్ నేత రమేష్ బిదూరి వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. అందంగా అలంకరించిన గుర్రంపై వరుడు లేని వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. బీజేపీ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని విమర్శించింది.
Addanki Dayakar: తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వస్తున్న విమర్శలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తీవ్రంగా స్పందించారు. హరీష్ రావు, కేటీఆర్, బీజేపీ నాయకులు విమర్శలకు తప్ప దేనికీ పనికిరారని ప్రజలకు అర్థమైందని ఆయన అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో రైతులు ఎన్నో గడ్డు రోజులు ఎదుర్కొన్నారని అన్నారు. ఒకే ఆర్థిక సంవత్సరంలో రైతు ఋణమాఫీ, రైతు భరోసా పథకాలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం…