Chunavi Muslim: త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయం వేడెక్కింది. ఈ రోజు (జనవరి 7) అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ‘చునావి (ఎన్నికల) ముసల్మాన్’ అనే క్యాప్షన్ తో సోషల్ మీడియాలో పోస్టర్‌తో విడుదల చేసింది. ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం అని అర్థం వచ్చేలా ఆ పోస్టర్ లో ఆప్ రాసుకొచ్చింది.
Read Also: BJP-Congress: బీజేపీ కార్యాలయంపై రాళ్లు విసిరిన యూత్ కాంగ్రెస్.. కార్యకర్తల మధ్య ఘర్షణ
ఇక, జామా మసీదు నేపథ్యంలో అమిత్ షా కాశ్మీరీ ఉన్ని టోపీని ధరించినట్లు ఈ పోస్టర్ లో ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. ఆ పోస్టర్‌లో రోహింగ్యాలు, బంగ్లాదేశ్, మౌల్వీ, మౌలానా, ఇమామ్, వక్ఫ్ బోర్డ్ ఉన్న ఫోటోలకు ఆయనను దర్శకుడిగా పేర్కొంది. చిత్ర నిర్మాత “లూటస్ ప్రొడక్షన్స్”గా ఆప్ వెల్లడించింది. అయితే, ఎన్నికల సమయంలోనే బీజేపీకి ముస్లింలు ఎందుకు గుర్తుకొస్తారని ఎప్పుడైనా ఆలోచించారా? అని ఆ పోస్టర్ లో ప్రశ్నించింది. కేవలం వారిని తన ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని ఆరోపించింది.
Read Also: Yuvaraj Singh: గతంలో నేనెప్పుడూ చూడలేదు.. కోహ్లీ, రోహిత్‌లు అద్భుతం: యువీ
అయితే, ఆలయ పూజారులు, గురుద్వారా గ్రాంథీలకు నెలకు రూ. 18,000 పరిహారం ఇస్తామని ఇటీవల ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. దీనికి కౌంటర్ గా కేజ్రీవాల్‌ను “చునావి (ఎన్నికల) హిందువు” బీజేపీ చిత్రీకరించింది. అందులో ‘భూల్ భూలయ్యా’లో నటుడు రాజ్‌పాల్ యాదవ్ పాత్రను పోలి, రుద్రాక్ష పూసలు, వెర్మిలియన్ ధరించి, పూజారి అవతారంలో కేజ్రీవాల్‌ను పోస్టర్ కమలం పార్టీ చిత్రీకరించింది.
चुनावी मुसलमान ❗
निर्माता एवं निर्देशक : अमित शाह pic.twitter.com/NjmrifukLd
— AAP (@AamAadmiParty) January 7, 2025