Anna University Incident: చెన్నైలోని అన్నాయూనివర్సిటీ క్యాంపస్‌లో 19 ఏళ్ల ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ విద్యార్థినిపై లైంగిక దాడి కేసు ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అధికార డీఎంకే సర్కార్‌పై, సీఎం ఎంకే స్టాలిన్‌పై విరుచుకుపడుతున్నారు.
Arvind Kejriwal: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తన అభ్యర్థుల్ని ప్రకటించింది. బీజేపీ, ఆప్ మధ్య భారీ పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.
Bandi Sanjay : సినీ ఇండస్ట్రీ ఆంధ్రకు పోవాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కి అంబేద్కర్ పంచ తీర్థాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా అని ప్రశ్నించారు. ముందు వాటిని సందర్శించు రాహుల్ గాంధీ అని ఆయన అన్నారు. Harish Rao : సమగ్ర శిక్ష ఉద్యోగులను…
సుపరిపాలన అందించడం వల్లే బీజేపీని వరుసగా మూడుసార్లు ప్రజలు గెలిపించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. బీజేపీని మరో రెండు మూడు సార్లు అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ బీజేపీకి స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు బీజేపీని సమర్థించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడారు.
Arvind Kejriwal News: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం (డిసెంబర్ 25) బిజెపిని టార్గెట్ గా చేసుకున్నారు.
డా.బీఆర్ అంబేడ్కర్‌ను అత్యధికంగా గౌరవించిన పార్టీ బీజేపీ అని రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి అన్నారు. రాజ్యాంగం, అంబేడ్కర్‌ను బీజేపీ ఎన్నడూ అగౌరపరచదన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తుందని బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అంబేడ్కర్ తమ నాయకుడని చెబుతున్న కాంగ్రెస్.. ఎందుకు భారత రత్న ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. వాజ్‌పేయీ హయాంలో అంబేడ్కర్‌కు భారతరత్న ఇచ్చిన ఘనత తమ పార్టీది అని పురందరేశ్వరి పేర్కొన్నారు. అంబేడ్కర్‌పై కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను…
కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి స్టైల్...కూటమిలో చర్చనీయాంశంగా మారింది. నిజం చెప్పాలంటే ఆదోని ప్రాంతంలో బీజేపీకి బలం లేదు. కూటమి పొత్తులో భాగంగా ఆదోని టికెట్ బీజేపీకి వెళ్లింది. దీంతో ఆ పార్టీ టికెట్ దక్కించుకుని పార్థసారథి గెలుపొందారు. గతంలోనూ టీడీపీ పొత్తులో ఆదోని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. అయితే ఎమ్మెల్యే పార్థసారథి వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారి తీస్తోందట.
బీజేపీ ఎందుకు...అల్లు అర్జున్‌కు సపోర్టు చేసేలా మాట్లాడుతుందనే చర్చ జనాల్లో జరుగుతోంది. మహిళ మరణించడం బాధాకరం అంటూనే...ఆ మహిళ కుటుంబాన్ని ప్రభుత్వం, అల్లు అర్జున్ పట్టించుకోవాలని కాషాయ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ రోజు ఆ సంఘటన జరిగి ఉండాల్సింది కాదని అంటున్న కమలం నేతలు...అనుమతి లేకున్నా అయనను ఎలా రోడ్ షో చేయించారని ప్రశ్నిస్తున్నారు.
ఒకే దేశం ఒకే ఎన్నికపై జేపీసీ తొలి సమావేశం తేదీ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 8న ఈ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఒక దేశం ఒకే ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. విపక్షాల గందరగోళం మధ్య ఈ బిల్లును జేపీసీ ఏర్పాటు చేశారు.