Varalaxmi Sarathkumar: ‘ఆయన వల్లే నేను ఇక్కడ ఉన్నాను’.. కన్నీళ్లు పెట్టుకున్న వరలక్ష్మి శరత్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varalaxmi Sarathkumar: తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి వరలక్ష్మి శరత్‌కుమార్. ఇప్పుడు ఆమె దర్శకురాలిగా తన మొదటి చిత్రం ‘సరస్వతి’తో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..” డైరెక్టర్ గోపీచంద్ మలినేని సార్ నా గురువు, మెంటార్, గైడ్.. ఆయన కారణంగానే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను. ఆయనే నాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు” అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఇండస్ట్రీ లో అమ్మాయిలు సర్వైవ్ అవడం చాలా కష్టం, వారికి సపోర్ట్ ఇవ్వండి అని కోరారు.
Also Read
ఇకపోతే ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరస్వతి’ ట్రైలర్ విషయానికి వస్తే.. కనబడకుండా పోయిన కూతురి కోసం ఒక అమ్మ ఎంత దూరం వెళ్తుందో.. అనే స్టోరీ లైన్‌తో ఈ ట్రైలర్ సాగుతుంది. పోలీస్ స్టేషన్‌లో ఆందోళనతో కూర్చున్న వరలక్ష్మి.. కోర్టు డ్రామా.. రివెంజ్ ఎలిమెంట్స్.. అన్నీ కలిసి ఈ చిత్రాన్ని ఒక భిన్నమైన థ్రిల్లర్‌గా మార్చాయి. ప్రియమణి, ప్రకాష్ రాజ్, కిషోర్ వంటి బలమైన నటీనటులతో ఈ సినిమా తెరకెక్కింది. తమన్ సంగీతం ఇప్పటికే సినిమాపై హైప్‌ను పెంచేసింది. ‘దోసా డైరీస్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని వరలక్ష్మి శరత్‌కుమార్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ‘సరస్వతి’ సినిమా థియేటర్లలోకి రాబోతోందని చిత్ర బృందం తెలిపింది.
READ ALSO: Realme P4 Lite: కేవలం రూ.7,999 కే అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. కళ్లు చెదిరే ఫీచర్లు!
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!