తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని అనంతపురం రేంజ్ డీఐజీ తెలిపారు. 2500 మంది సిబ్బందితో పది రోజులు పాటు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మొన్న జరిగిన ఘటన పై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని.. ఉహించనిదన్నారు. భక్తుల భద్రతపై పూర్తి భరోసా పోలీసు శాఖ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై భక్తులు వద్ద ఏమైన ఆధారాలు ఉంటే సమర్పించాలని.. దర్యాప్తు సహకరించాలని కోరారు.
READ MORE: Daaku Maharaaj : నేడు డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే..?
ఘటన జరిగిన సమయంలో 90 మంది పోలీసులు బైరాగిపట్టడా కేంద్రం వద్ద ఉన్నారని డీఐజీ తెలిపారు. గేటు తెరిచే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారా? లేదా? అన్న దిశగా దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు. గేటు తెరవడానికి సంబంధిత అధికారి తీసుకున్న నిర్ణయం సరైనదా? కాదా? అనే అంశం తేలాల్సి ఉందని చెప్పారు. టోకెన్ల జారీ సమయంలో భద్రత సిబ్బంది మళ్లింపు జరగలేదన్నారు. కుప్పం బందోబస్తుకు, పోలీసు రిక్రూట్మెంట్‌కి బందోబస్తు మల్లింపు చెయ్యలేదని స్పష్టం చేశారు.
READ MORE: Gautam Gambhir: గంభీర్ చేసే పనులకు.. చెప్పే మాటలకు పొంతన ఉండదు: మనోజ్ తివారీ
ఇదిలా ఉండగా.. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ వేళ తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు టీటీడీ ప్రత్యేక వైకుంఠం ద్వార దర్శనం చేయించింది. గాయపడిన భక్తులందరినీ టీటీడీ ప్రత్యేకంగా తిరుమలకు రప్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల ప్రకారం మొత్తం 52 మందికి ప్రత్యేక దర్శనం కల్పించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి మంచి వైద్యం అందించి, వైకుంఠద్వార దర్శనం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీకి భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు.