కేటీఆర్ విచారణపై కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ కుటుంబానికి ఏదో ఒప్పందం ఉందనిపిస్తోందని ఆరోపించారు. లొట్టపీసు ముఖ్యమంత్రి అని కేటీఆర్ మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నాడని ప్రశ్నించారు. కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తారో లేదో కూడా అనుమానమేనని తెలిపారు. ఫార్ములా ఈ రేస్‌లో రూ.700 కోట్లు లాభాలు వచ్చాయంటున్న కేటీఆర్.. అవి ఎక్కడున్నాయో కూడా చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒక్కటే.. కావాలనే ఈ డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ వదిలిపెట్టదు.. కచ్చితంగా వారి అవినీతిని బయటపెడుతామని అన్నారు. పొంగులేటి బాంబులు బాంబులు అన్నారు .. దీపావళి పోయింది, ముక్కోటి ఏకాదశి వెళ్లింది.. రేపు సంక్రాతి కూడా పోతుంది.. కానీ అవి పేలవని బండి సంజయ్ విమర్శించారు.
Read Also: Harish Rao : ఊసరవెల్లి సైతం సిగ్గుపడేలా మాట మార్చారు
మరోవైపు.. కరీంనగర్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేస్తామని బండి సంజయ్ తెలిపారు. అమృత్ భారత్ స్కీం ద్వారా ప్రధాని మోడీ 1300 రైల్వే పనులను పునరుద్దరిస్తున్నారని అన్నారు. మార్చి లోపు కరీంనగర్ రైల్వే స్టేషనుని ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. రూ.95 కోట్లతో కరీంనగర్ రైల్వే స్టేషను పనులు జరుగుతున్నాయి.. సకల సౌకర్యాలతో మోడల్ రైల్వే స్టేషనుగా రూపుదిద్దుతామని చెప్పారు. కరీంనగర్ ఆర్వోబీ పనులు అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆగిపోయాయి.. సేతుబంధు స్కీం ద్వారా కేంద్రప్రభుత్వం నిధులతో ఆర్వోబీ పనులు చేస్తున్నాం.. కేంద్రం వందశాతం పూర్తి నిధులు కేటాయించిందని బండి సంజయ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండాలి.. భూసేకరణ చేయాల్సినది రాష్ట్ర ప్రభుత్వమేనని తెలిపారు. అంతేకాకుండా.. ఉప్పల్ ఆర్వోబీ పనులని ఆరు నెలలలో పూర్తి చేస్తామన్నారు. అలాగే.. 2027 లోపు కొత్తపల్లి-మనోహరాబాద్ పనులు పూర్తిచేయడానికి టార్గెట్ పెట్టుకున్నామని బండి సంజయ్ చెప్పారు.
Read Also: Kajal : బాలీవుడ్ లో మరో కొత్త ప్రజెక్ట్‌కి పచ్చజెండా ఊపిన కాజల్