NZ vs PAK Weather Update: పాకిస్థాన్‌కు ‘వరణుడి’ షాక్.. కివీస్‌తో మ్యాచ్ ముందే సీన్ రివర్స్.. బాబర్ సేన సెమీస్ ఆశలు గల్లంతేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NZ vs PAK Weather Update: టీ20 ప్రపంచకప్ 2026లో అసలైన సమరం మొదలైంది. భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో నేటి నుంచి సూపర్-8 స్టేజ్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లోనే కొలంబో వేదికగా పాకిస్థాన్, న్యూజీలాండ్ జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ కీలక మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. గ్రూప్ దశలో సమవుజ్జీలుగా నిలిచిన పాక్, కివీస్ జట్లు సూపర్-8లో శుభారంభం చేయాలని భావిస్తున్నాయి. సల్మాన్ అలీ అఘా సారథ్యంలోని పాక్ జట్టు, మిచెల్ సాంట్నర్ నేతృత్వంలోని న్యూజీలాండ్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. కానీ, కొలంబోలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు మ్యాచ్‌పై నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.
READ ALSO: Varalaxmi Sarathkumar: ‘ఆయన వల్లే నేను ఇక్కడ ఉన్నాను’.. కన్నీళ్లు పెట్టుకున్న వరలక్ష్మి శరత్ కుమార్
Also Read
వెదర్ రిపోర్ట్ ఏం చెబుతోందంటే..
బీబీసీ, అక్యూవెదర్ నివేదికల ప్రకారం.. కొలంబోలో ఈరోజు 75% నుంచి 80% వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మ్యాచ్ ప్రారంభమయ్యే రాత్రి 7 గంటల సమయంలో భారీ వర్షంతో పాటు ఉరుములు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వర్షం కారణంగా పాక్ జట్టు తన ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
పాకిస్థాన్‌కు ఎందుకంత రిస్క్ అంటే..
ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్-8 మ్యాచులకు రిజర్వ్ డే లేదు. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. ఒక పాయింట్‌తో సరిపెట్టుకుంటే పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు క్లిష్టమవుతాయి. పాక్ తన తదుపరి మ్యాచుల్లో బలమైన ఇంగ్లాండ్, శ్రీలంకతో తలపడాల్సి ఉంటుంది. సెమీస్‌కు వెళ్లాలంటే సూపర్-8లో కనీసం రెండు విజయాలు తప్పనిసరి.
READ ALSO: Realme P4 Lite: కేవలం రూ.7,999 కే అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. కళ్లు చెదిరే ఫీచర్లు!
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!