ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ వెళ్లి రాష్ట్రానికి లక్ష 78 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తే.. సంతోషించవలసిన కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేది ఒక ఫెడరల్ సెటప్.. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే కేంద్రం అని కడియం శ్రీహరి పేర్కొన్నారు.
Amit Shah : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోలోని పార్ట్-3ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. పార్టీ వరుసగా మూడోసారి అనేక పెద్ద ప్రకటనలు చేసింది.
కరీంనగర్ మేయర్ సునీల్ రావుతో సహ పలువురు కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మేయర్ తో పాటు బీజేపీలో చేరిన వారిలో శ్రీదేవి చంద్రమౌళి, లెక్కల స్వప్న వేణు తదితరులు ఉన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. నవంబర్ 2023 సంవత్సరంలో 15 రోజుల పాటు త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు.. దర్యాప్తులో భాగంగా ఇంద్రసేన రెడ్డి పీఏను అధికారులు విచారించారు. విచారణ సమయంలో ఫోన్ ట్యాప్ వ్యవహారం బయటపడింది.. ప్రస్తుతం ఇంద్రసేనరెడ్డి త్రిపుర గవర్నర్గా ఉన్నారు.
కిషన్ రెడ్డి పదేళ్లు మంత్రిగా ఉండి ఏం చేశారు? తెలంగాణకు కొత్త ప్రాజెక్టు తీసుకువచ్చారా? అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ తో లోపాయికారీ ఒప్పందంతో కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు.
కరీంనగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం బండి సంజయ్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. "మేయర్ తో కలిసి 20 మంది కార్పొరేటర్లు బీజేపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందు మేయర్ సునీల్ రావు ప్రతిపాదన ఉంచారు.
రాజ్యసభలో పెద్దలుంటారు.. వయసులో కాదు.. హోదాలో.. అందుకే పెద్దల సభ అంటారు. మరిక్కడ ఏం జరుగుతోంది.. కొంతమంది. పెద్దల వ్యవహార శైలి ఎందుకు విచిత్రంగా ఉంటోంది. ప్రస్తుతం ఈ సందేహాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలైన.. టీడీపీ, వైసీపీల్లో రాజ్యసభ సభ్యుల తీరు మరింత ఆశ్చర్యంగా.. ఇంకొంచెం విచిత్రంగానూ ఉంది.. సాయిరెడ్డి రాజీనామాతో ఈ చర్చ బాగా ఎక్కువగా జరుగుతోంది.
Kishan Reddy : కార్మికుల కోసం , బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం పని చేసిన వ్యక్తి కర్పూరి ఠాకూర్ అని, బీహార్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి గా సేవలు అందించారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందీ భాష ప్రోత్సాహానికి విశేష కృషి చేశారని, గత ఏడాది అయన శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారత రత్న బిరుదు ఇచ్చిందన్నారు. ఇందిరాగాంధీ నియంతృత్వ…
Non-veg Food At Temple: తమిళనాడు రాష్ట్రంలోని మదురై జిల్లాలో గల ప్రసిద్ధ తిరుపరంకుండ్రం మురుగన్ దేవాలయ కొండపై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ నవాస్ కానీ మాంసాహారం తిన్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. దీనిపై రామనాథపురం ఎంపీ స్పందించారు. ఈ సందర్భంగా అతడి చేసిన అభియోగాలను నిరూపించలేకపోతే రాజీనామా చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు.
Manish Sisodia: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోదియా సంచలన కామెంట్స్ చేశారు. తాను తిహాడ్ జైల్లో ఉన్న సమయంలో బీజేపీ తనకు సీఎం పదవిని ఆఫర్ చేసింది..