వింటర్ సీజన్లో దేశ రాజధాని ఢిల్లీలో వాడివేడి విమర్శలతో రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో ఐదేళ్లలో నిరుద్యోగాన్ని అంతం చేస్తానని ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కేజ్రీవాల్ ఓటర్లను ఉద్దేశించి ఓ వీడియో విడుదల చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి ఏర్పడి వచ్చేనెల 11కు నాలుగేళ్లు పూర్తవుతుంది. 2021 ఫిబ్రవరి 11న మేయర్ గద్వాల విజయలక్ష్మిని డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత శోభన్ రెడ్డిని ఎన్నుకున్నారు అప్పుడు మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్స్. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కారు దిగేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మేయర్. దీన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు ఆ పార్టీ అధిష్టానం సైతం అస్సలు జీర్ణించుకోలేకపోతోందట.
Congress: దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) 2025లో పాల్గొనేందుకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదు. ఇప్పుడు ఇదే అక్కడ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ తీరును ఎండగడుతోంది. కాంగ్రెస్‌లో నెలకొన్న అధికార కుమ్ములాటలే ఇందుకు కారణమని బీజేపీ ఆరోపిస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ రూ.382 కోట్ల కొత్త కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ జాతీయ కోశాధికారి అజయ్ మాకెన్ ఆరోపించారు. బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో పార్టీని ఏర్పాటు చేశామన్నారు. అప్పట్లో ఓ నాయకుడు కాగ్ రిపోర్టు తెచ్చి కాంగ్రెస్ పై ధ్వజమెత్తేవాడని, ఇప్పుడు అదే కాగ్ రిపోర్టులే వారి అవినీతిని చెబుతున్నాయన్నారు. 14 కాగ్ నివేదికలు వచ్చాయని అజయ్ మాకెన్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో రూ.382 కోట్ల ఆరోగ్య…
PM Modi: ఢిల్లీ ఎన్నికలకు మరి కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. అధికార ఆప్, బీజేపీ మధ్య పోరు రసవత్తరంగా మారింది. కాంగ్రెస్‌తో ఢిల్లీ పోరు త్రిముఖ పోటీగా మారింది. ఇదిలా ఉంటే, బీజేపీ మాత్రం ఆప్‌ని, ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ని టార్గెట్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తోంది. తాజాగా, ఢిల్లీలోని బూత్ స్థాయి కార్యకర్తలను ఉద్దేశించి ‘‘మేరా బూత్ సబ్ సే మజ్బూత్’’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. ఆప్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ…
Nitish Kumar: బీజేపీ ప్రభుత్వానికి సీఎం నితీష్ కుమార్ షాక్ ఇచ్చారు. ఆయన నేతృత్వంలోని జేడీయూ మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. సీఎం బీరెన్ సింగ్ ప్రభుత్వానికి జేడీయూకి ఉన్న ఒక ఎమ్మెల్యే మద్దతుని విత్ డ్రా చేసుకుని, ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధపడ్డారు. అయితే, ఈ పరిణామం అక్కడి ప్రభుత్వంపై పెద్దగా ప్రభావం చూపదు. బీజేపీ ప్రభుత్వ మెజారిటిపై పెద్దగా ఎఫెక్ట్ పడదు.
Katchatheevu: లోక్‌సభ ఎన్నికల ముందు తమిళనాడులో చర్చనీయాంశంగా మారిన ‘‘కచ్చతీవు’’ దీవుల వ్యవహారం మరోసారి రాజకీయాంశంగా మారింది. 1974లో భారత సార్వభౌమాధికారం కింద ఉన్న కచ్చతీవు ద్వీపాన్ని అప్పటి ప్రధాని ఇండిరా గాంధీ శ్రీలంకకు అప్పగించింది. ఈ నిర్ణయాన్ని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కేఎస్ అళగిరి సెల్వపెరుంతగై ప్రశంసించారు. దీనిపై బీజేపీ తమిళనాడు చీఫ్ కే. అన్నామలై తీవ్ర విమర్శలు గుప్పించారు.