Prakash Reddy: ముఖ్యమంత్రిపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విమర్శలు
- ముఖ్యమంత్రిపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి విమర్శలు
- పద్మ అవార్డులపై చేసిన వ్యాఖ్యలపై మండిపాటు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakash Reddy: తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా పద్మ అవార్డులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయని ఆయన ఆరోపించారు. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పూర్తిగా పారదర్శకంగా పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. పద్మ అవార్డుల ప్రకటన ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని ప్రకాష్ రెడ్డి తప్పుపట్టారు. ముఖ్యమంత్రి పద్మ అవార్డులకు ఐదుగురిని మాత్రమే సిఫారసు చేయగా, తెలంగాణ నుంచి 300 మందికి పైగా పేర్లు సిఫారసు చేయబడ్డాయన్నారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి, “మీరు సిఫారసు చేసిన ఐదుగురే అర్హులా? మిగతా మూడు వందల మందిని అర్హులుగా పరిగణించరా?” అని ఆయన ప్రశ్నించారు.
Also Read: NTR: జూనియర్ ఎన్టీఆర్ పై హాలీవుడ్ డైరెక్టర్ సంచలన కామెంట్స్..
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు లభించడం సీఎం రేవంత్ రెడ్డికి జీర్ణించుకోవడం లేదని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. అలాగే, గద్దర్‌ను గౌరవిస్తామని, ఈ విషయం పట్ల సీఎం నిష్పక్షపాతంగా ఉండాలని హితవు పలికారు. పద్మ అవార్డులను గౌరవించకుండా రాజకీయాలకు వాడడం సరికాదని సూచించారు. “రేవంత్ రెడ్డి తన పూర్వ కాంగ్రెస్ నాయకత్వం నుంచి నికృష్టమైన రాజకీయాలు నేర్చుకున్నారు. నెహ్రూ కుటుంబానికి కుశలమంటూ, గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడం ప్రజలు గమనిస్తున్నారు” అని తెలిపారు. విద్యా వ్యవస్థలో నక్సలిజం భావజాలం చొప్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. అకునూరి మురళీ, హరగోపాల్, రమా మేల్కోటేలను మాత్రమే విద్యా వ్యవస్థకు అర్హులుగా చూడడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు.
గాంధీ కుటుంబం, గాడ్సే కుటుంబం గురించి దేశ ప్రజలకు స్పష్టత ఉందని ప్రకాష్ రెడ్డి అన్నారు. మహమ్మద్ గజనీతో ప్రధాని మోడీని పోల్చడం రేవంత్ రెడ్డి కుసంస్కారానికి నిదర్శనమని చెప్పారు. ప్రకాష్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, బీజేపీ నాయకుల స్పందనలు, ఆవార్డులపై వివాదాలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.
తాజావార్తలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!