Swati Maliwal: హీటెక్కిన ఢిల్లీ పాలిటిక్స్.. కేజ్రీవాల్ ఇంటి ముందు చెత్త వేసి స్వాతి మాలివాల్ నిరసన
- హీటెక్కిన ఢిల్లీ పాలిటిక్స్
- కేజ్రీవాల్ ఇంటి ముందు చెత్త వేసి స్వాతి మాలివాల్ నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. మరో మూడు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. నిన్నటి దాకా యమునా నీళ్లపై ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. తాజాగా రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ ‘చెత్త’ రాజకీయానికి తెరలేపారు. వికాస్‌పురిలో ఉన్న చెత్తను మూడు ట్రక్కుల్లో నింపి.. ఫిరోజ్‌షా రోడ్‌లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇంటి ముందు వేసి నిరసన తెలిపింది. తన సహచర బృందంతో ఈ కార్యక్రమానికి పూనుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్వాతి మాలివాల్‌ను అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇది కూడా చదవండి: Rag Mayur: ఒకే రోజు విలన్‌గా, హీరోగా.. స్టేట్ టాపర్ టు లీడ్ యాక్టర్: రాగ్ మయూర్ ఇంటర్వ్యూ
Also Read
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వాతి మాలివాల్ ఎక్స్ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ‘‘వికాస్‌పురిలో రోడ్లపై ఏళ్ల తరబడి చెత్త కుప్పలు కుప్పలుగా ఉన్నాయి.. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.. ఈ చెత్తనంతా సేకరించి కేజ్రీవాల్ ఇంటి దగ్గర వేయబోతున్నారు’’ అని ఆమె పోస్ట్‌లో రాశారు. ‘‘మొత్తం ఢిల్లీ పరిస్థితి క్షీణించింది. ఢిల్లీ వాసులు రోజూ ఎదుర్కొనే అపరిశుభ్రత మరియు దుర్వాసన ఈ రోజు కేజ్రీవాల్‌కి ఎదురవుతాయి … ప్రజలు వస్తున్నారు, కేజ్రీవాల్.. భయపడవద్దు.’’ అంటూ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Union Budget 2025: నిర్మలమ్మ బడ్జెట్‌లో ఈ రాష్ట్రాలకు తాయిలాలు ఉండే ఛాన్స్!
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిని అనుమతించబోమన్నారు. ఇదిలా ఉంటే గతేడాది మే నెలలో కేజ్రీవాల్‌ను కలిసేందుకు స్వాతి మాలివాల్ ఇంటికి వెళ్లినప్పుడు.. ఆమెపై కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి దారుణంగా దాడి చేశాడు. రుతుక్రమంలో ఉన్నానని చెప్పినా.. కనికరం లేకుండా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. అప్పటి నుంచి విభేదాలు తలెత్తాయి. అంతేకాకుండా ఆప్ రాజ్యసభ సభ్యురాలిగా కూడా కొనసాగుతోంది.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది.
ये सारा कूड़ा अभी केजरीवाल जी के घर फेंकने जा रही हूँ… pic.twitter.com/y92RqVy116
— Swati Maliwal (@SwatiJaiHind) January 30, 2025
#WATCH | Delhi: Police detained Rajya Sabha MP Swati Maliwal after she dumped garbage outside AAP national convener Arvind Kejriwal’s residence in protest over cleanliness pic.twitter.com/UJyh56pXWe
— ANI (@ANI) January 30, 2025
Arvind Kejriwal ने पुलिस भेजकर अपने घर के बाहर से स्वाति मालीवल जी को Arrest करवाया – Tweeted by Team pic.twitter.com/1bmOGanS1f
— Swati Maliwal (@SwatiJaiHind) January 30, 2025
#WATCH | Delhi: Rajya Sabha MP Swati Maliwal says, "The whole city has turned into a garbage bin…I came here to have a conversation with Arvind Kejriwal… I would say to him 'sudhar jao warna janata sudhaar degi'… I am neither afraid of his goons nor his police…" https://t.co/iFldkCj75G pic.twitter.com/jgf0ZupcGZ
— ANI (@ANI) January 30, 2025
తాజావార్తలు
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్‌న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!