MP K.Laxman: ప్రధానిపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ నేతలు ఆగ్రహం
- ప్రధాని మోడీని మహ్మద్ గజనీతో పోల్చుతూ సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు
- సీఎం తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్న రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్
- రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హిందూ ధార్మికతను అవమానించేలా ఉన్నాయి- లక్ష్మణ్
- రేవంత్ రెడ్డి మాటలు దిగజరారిన రాజకీయాలకు, చౌకబారు మాటలకు నిదర్శనం- లక్ష్మణ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీని మహ్మద్ గజనీతో పోల్చతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హిందూ ధార్మికతను అవమానించేలా ఉన్నాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మాటలు దిగజరారిన రాజకీయాలకు, చౌకబారు మాటలకు నిదర్శనం అని దుయ్యబట్టారు. మహ్మద్ గజనీ దేశాన్ని దోచుకున్నాడు.. హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి మన సాంస్కృతిక వారసత్వాన్ని మట్టిలో కలిపాడన్నారు. అలాంటి దోపిడీదారుడితో ప్రధాని మోడీని పోల్చడం రేవంత్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అని అన్నారు.
Read Also: Delhi: ఎయిర్‌పోర్టులో రూ.10 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. కేటుగాడు ఎక్కడ దాచాడంటే..!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
మోడీ నాయకత్వంలో భారతదేశం తన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని తిరిగి చాటుకుంటోందని తెలిపారు. సోమనాథ్ ఆలయం, కాశీ విశ్వనాథ్ కారిడార్, అయోధ్య రామమందిరం వంటి ఆలయాలను పునర్నిర్మించి హిందువుల మనోభావాలను గౌరవించేలా మోడీ ప్రభుత్వం సాంస్కృతిక పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు కేటాయించి, హిందూ దేవాలయాల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతోందని అన్నారు. మహ్మద్ గజినీ మన దేశంపై దాడి చేసి హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడని.. ప్రధాని మోడీ ధ్వంసమైన దేవాలయాలను పునరుద్ధరించి, హిందూ ధార్మికతను, గౌరవాన్ని పెంచారని లక్ష్మణ్ తెలిపారు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి అనే హోదాను కూడా మర్చిపోయి దిగజారుడు మాటలు మాట్లాడటం సిగ్గుచేటని ఆరోపించారు. దేశాభివృద్ధి కోసం విశ్వమానవతా స్ఫూర్తితో పనిచేస్తున్న ప్రధాని మోడీని మహ్మద్ గజినీతో పోల్చడం.. భారతీయ సంస్కృతిని అవమానించడం లాంటిదేనని లక్ష్మణ్ పేర్కొన్నారు.
Read Also: CPM: సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ..
గాంధీజీ పిలుపునిచ్చిన స్వదేశీ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా విస్మరించిందని లక్ష్మణ్ పేర్కొన్నారు. బీజేపీ మహాత్మా గాంధీ శాంతి, అహింస సిద్ధాంతాలను పాటిస్తూ.. దేశాభివృద్ధి కోసం పాటుపడుతోందని తెలిపారు. కానీ కాంగ్రెస్ మహాత్మా గాంధీ పేరును రాజకీయం కోసం వాడుకుంటోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ భావజాలానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించిందని చెప్పారు. అహింస సిద్ధాంతానికి విరుద్ధంగా 1975లో ఎమర్జెన్సీని విధించి, ప్రజల స్వేచ్ఛను తుంగలో తొక్కిందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం కాదు, తన స్వంత ప్రయోజనాల కోసం 90 సార్లు రాజ్యాంగాన్ని మార్చిందని లక్ష్మణ్ తెలిపారు. గాంధీ అహింస సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకంగా నక్సల్స్ మద్దతుదారులను ప్రోత్సహించడం.. తెలంగాణలో మావోయిస్టులకు పరోక్షంగా మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ తీరును బహిర్గతం చేస్తోందని ఆరోపించారు.
తాజావార్తలు
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!