సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా రాజకీయ జీవితంలో ఒక్క గజం స్థలం కబ్జా చేసినట్లు రుజువు చేసినా పట్టణంలోని పోలీస్ స్టేషన్ ముందు విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్దం అని సవాల్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ఇటీవల చేస్తున్న ఆరోపణలపై భగ్గుమన్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తాను యంపీపీ, ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు పటాన్ చెరు నియోజక పరిధిలో చేసిన అభివృద్ధి పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తనపై కోర్టులో ఉన్న కేస్ ను సుప్రీం కోర్టు ఆదేశాలతో హైకోర్టులో క్రాష్ చేసిందన్నారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.
మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ 2023 లో బీజేపీ నుండి ఎమ్మెల్యే గా టికెట్టు తెచ్చుకొని నిలబిడితే సామాన్య టీఆర్‌ఎస్ కార్యకర్తను నిలబెట్టి ఎమ్మెల్యే గా గెలిపిస్తానని సవాల్ విసిరారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. నందీశ్వర్ గౌడ్ తనపై చేస్తున్న అనుచిత వాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు. వాస్తవాలను రుజువులతో ప్రజల ముందుకు తీసుకు రావాలని అన్నారు.