కేంద్రంలో బీజేపీ తీరుపై తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ హాట్ కామెంట్స్ చేశారు. కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యునివర్సిటీ, ఉక్కు ఫ్యాక్టరీకి భూమి ఇచ్చినా ఇవ్వలేదన్న మెంటల్ పార్టీ బీజేపీ అంటూ విరుచుకుపడ్డారు.
ముఖ్యమంత్రి కేంద్రం తీరుకు బాధతో వరి పంట వేయవద్దని చెప్పారు. కేంద్రం రా రైస్ ను కొనుడు కాదు..ఒడ్లు కొనేవరకు వదిలిపెట్టేది లేదు. గ్రామాలలో బీజేపీ కార్యకర్తలను ఉరికించాలి. గ్రామాల్లో రైతులు సంఘటితం అయ్యి కేంద్రానికి వ్యతరేకంగా ఇంటి పై నల్ల జెండాలు కట్టి, బీజేపీ దిష్టిబొమ్మలు తగులబెట్టి నిరసన తెలపాలన్నారు.
ఎన్నికలు ముగియగానే పెట్రోల్,డీజిల్ ,గ్యాస్ ధరలను పెంచింది. బీజేపీ జనం మీద భారం మోపింది. కేంద్రం రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేదు. ఆంధ్రలో 17 కాలేజీలు ఇచ్చింది. కరెంట్ కు మీటర్లు పెడితే ఒక్కో మీటరుకు నెలకు 70 వేలు బిల్లు చెల్లించాల్సి వస్తుంది. ఈ సంవత్సరం మూడువేల ఇళ్ళు, వచ్చే సంవత్సరం మరో మూడువేల ఇళ్ళు ఇస్తాం అన్నారు మంత్రి ఎర్రబెల్లి. 14 వేల కొత్త పెన్షన్ లు ఇవ్వబోతున్నామని తెలిపారు.