రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు కాంగ్రెస్ విదేశీ అజెండాను మోస్తుందని విమర్శించారు. సీఎం శిఖండి రాజకీయాలు చేస్తున్నారని.. ఆపరేషన్ సిందూర్ ఆగిపోలేదని తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేంత వరకు కొనసాగుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అజ్ఞానంతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని.. దేశ భద్రత పై సీఎం చేసిన వ్యాఖ్యలు దేశద్రోహ చర్యతో సమానమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి దేశప్రజలంతా అండగా…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, నిరాధారణమైన ఆరోపణలన్నారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో రాపెల్ యుద్ధ విమానాలు కోల్పోయామని చెప్పడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.
సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన ఇంకా కశ్మీర్ సమస్య అలాగే ఉంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. కశ్మీర్ కి స్వతంత్రపతిపత్తి ఇచ్చి వివాదానికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆనాడు ఇందిర గాంధీ పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకొని ఉంటే ఈనాడు భారత్ దేశానికి ఈ పరిస్థితి వచ్చి ఉండేదా ? అని నిలదీశారు.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో ఒకేలా సీన్లు రిపీట్ అవుతున్నాయన్నారు. తండ్రులు సంపాదించిన ఆస్తుల పంపకాల్లో, రాజకీయ పదవుల్లో పంపకాల్లో తేడాలున్నాయని.. అన్నలు వదిలిన బాణాలు.. అన్నల మీదికే చెల్లెలు గురిపేడుతున్నారన్నారు.
Bandi Sanjay : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. మెదక్ జిల్లా ఎల్లారెడ్డిపేటలో జరిగిన సభలో ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. “కాంగ్రెస్ ఖేల్ ఖతం, దుకాణ్ బంద్” అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం స్వయంగా చేసిన వ్యాఖ్యలే వారి వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్,…
Addanki Dayakar : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ ఛార్జ్షీట్లో చేర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ టీపీసీసీ నేతృత్వంలో హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కొనే…
హర్యానా యమునా నగర్ ర్యాలీలో మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేసిన మోడీ.. తెలంగాణ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని మోడీ అన్నారు. అలాగే.. హెచ్సీయూ కంచ గచ్చిబౌలి భూములపై తొలిసారిగా స్పందిస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ భూములను నాశనం చేస్తుందని విమర్శించారు.
అలహాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో దళిత నాయకుడు, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఘోర అవమానం జరిగిందని చర్చ జరుగుతోంది. సమావేశంలో ఆయనకు ప్రత్యేక కుర్చీని ఏర్పాటు చేశారని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మధ్యలో సోఫాలో కూర్చున్నారని బీజేపీ ఆరోపించింది. భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాల్వియా ఈ అంశాన్ని బయటపెట్టారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలో ఈ మేరకు ఓ పోస్ట్ చేశారు. “మొదట ఖర్గే…
Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దళితులను అవమానించే పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ లాంటి గొప్ప దళిత నాయకులను అడుగడుగునా అవమానించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ఇందిరా గాంధీ నేతృత్వంలో దళితుడు ప్రధాని అవతాడన్న పరిస్థితి ఏర్పడుతుందని భయపడి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారని బండి సంజయ్ ఆరోపించారు. “దళితులకు నిజంగా అండగా…
Komatireddy Venkat Reddy : పేద ప్రజల ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు సన్న బియ్యం పంపిణీ సాహసోపేత నిర్ణయమని తెలంగాణ మునిసిపల్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో ఇవాళ NTVతో మాట్లాడిన ఆయన, ఈ పథకం వల్ల పేదల ఆత్మగౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. పేదలకు మెరుగైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందని ఆయన వివరించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, “గత ప్రభుత్వాలు రేషన్ కార్డుల పంపిణీ విషయంలో…