Boora Narsaiah Goud : కాంగ్రెస్ నాయకత్వంపై బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఘాటు విమర్శలు చేశారు. రాహుల్ గాంధీని చూస్తుంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గుర్తొస్తున్నారు అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఓ జెలెన్స్కీ లాంటివారిగా మారారని ఎద్దేవా చేశారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణలో బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించాలన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే పనిలో ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. రోజుకో తీపి కబురుతో కాలయాపన చేస్తోంది అని మండిపడ్డారు. గత ప్రభుత్వం నిర్మించిన ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్)ను కుదించడం ద్వారా ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసిందన్నారు.
Plane Crash: విషాద గాధ.. ప్రారంభంలోనే ముగిసిన ఎయిర్ హోస్టెస్ కెరీర్..
ప్రభుత్వానికి ప్రత్యేకంగా సచివాలయం ఎందుకు కావాలి? గాంధీభవన్ నుంచే పాలన కొనసాగించండి అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు నర్సయ్య గౌడ్. సచివాలయం కాంగ్రెస్ పార్టీదేమీ కాదు… అది ప్రజలదే అని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించాలని డిమాండ్ చేసిన నర్సయ్య గౌడ్, “సొల్లు కబుర్లు చెప్పకుండా బీసీలకు న్యాయం చేయాలి” అని అన్నారు. తెలంగాణలో జరిగిన కుల గణనను కూడా పూర్తిగా బయటపెట్టాలని కోరారు.
“కుల గణనను కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులను విభజించడానికే ఉపయోగించింది” అని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని బూర నర్సయ్య డిమాండ్ చేశారు. “ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన డబ్బు ఎంత..? ఖర్చు పెట్టింది ఎంత..? ప్రజలకు ఇచ్చింది ఎంత..? అన్నదీ స్పష్టంగా బహిర్గతం చేయాలి” అని అన్నారు. రాహుల్ గాంధీకి ఎవరు ఎక్కువ డబ్బు సంచులు పంపిస్తారో అని పోటీ పడుతోంది పార్టీ. కానీ ప్రజల ప్రయోజనాలపై మాత్రం కాంగ్రెస్‌కు దృష్టి లేదు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.
Ram Mohan Naidu: “నా తండ్రి కూడా ప్రమాదంలోనే మరణించారు.. ఆ బాధ నాకు తెలుసు”