BJP vs Congress: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ దాడిపై బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఢిల్లీ పేలుడు తర్వాత చిదంబరం మాట్లాడుతూ.. భారతదేశం రెండు రకాల ఉగ్రవాదులను ఎదుర్కొంటుందని ఆయన అన్నారు.
Imran Masood:బీహార్ ఎన్నికల పోరులో కొత్త పంచాయతీ మొదలైంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ దేశభక్తుడు, విప్లవకారుడు భగత్ సింగ్‌ను తీవ్రవాద ఇస్లామిక్ సంస్థ హమాస్‌తో పోల్చడం బీహార్‌లో కొత్త వివాదానికి దారితీసింది. ఆయన ప్రకటనపై బీజేపీ ఎదురు దాడి చేయడం ప్రారంభించింది. బీజేపీ దాడి తరువాత మసూద్ తన ప్రకటనపై వెనక్కి తగ్గాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ అలాంటి పోలిక చేయలేదని, భగత్ సింగ్ “షహీద్-ఎ-ఆజం” అని,…
Rahul Gandhi: బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రధానమంత్రి కార్యాలయాన్ని అగౌరపరిచేవిగా, ‘‘మర్యాద అన్ని హద్దులు దాటాయి’’ అని బీజేపీ పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు వ్యక్తిగమైనవని, ఎగతాళి చేసేవిగా ఉన్నాయని, భారత గణతంత్ర రాజ్య అత్యున్నత రాజ్యాంగ కార్యాలయ గౌరవాన్ని అవమానించే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాయని చెప్పింది.
DK Shivakumar: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం కాలంలో ‘‘కార్లు లేని అబ్బాయిలకు అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేయడం లేదు’’ అని అన్నారు. బెంగళూర్‌లో టన్నెల్ రోడ్ ప్రాజెక్టును సమర్థిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Karnataka: కర్ణాటకలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ఇటీవల, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బెంగళూర్ సౌత్ ఎంపీ, బీజేపీ తేజస్వీ సూర్యను ‘‘అమావాస్య’’గా పిలిచారు. దీనికి తేజస్వీ స్పందిస్తూ.. సీఎం సిద్ధరామయ్య ‘‘కర్ణాటకకు గ్రహణం’’ అని అన్నారు. సిద్ధరామయ్య పాలన రాష్ట్రానికి గ్రహణం లాంటిది అని విమర్శించారు. Read Also: CM Chandrababu: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అత్యవసర నిధుల విడుదలకు సీఎం ఆదేశాలు.. తనను అమావాస్య, పౌర్ణమిగా…
Karnataka: కర్ణాటక చిత్తాపూర్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ర్యాలీకి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంపై రాజకీయ వివాదం రాజుకుంది. శాంతిభద్రతల సమస్యను పేర్కొంటూ అధికారులు అనుమతికి నిరాకరించారు. ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తి, సంస్థ శతాబ్ది ఉత్సవాలకు, విజయదశమి ఉత్సవం కోసం పట్టణంలో చిన్న స్థాయి ఊరేగింపు నిర్వహించడానికి అనుమతి కోరారు. దీనికి పోలీసుల నుంచి నిరాకరణ ఎదురైంది. ఆదివారం ఆర్ఎస్ఎస్ మార్చ్‌కు అనుమతి కోరిన అదే మార్గంలో భీమ్ ఆర్మీ,భారతీయ దళిత్ పాంథర్ (R)…
Garba Rules: ఉత్తరాదిన నవరాత్రుల్లో జరిగే ‘‘గర్బా’’ వేడుకల కోసం పలు హిందూ సంఘాలు నిమయాలను రూపొందించాయి. పలు సందర్భాల్లో గర్భాలోకి అన్యమతస్తులు ప్రవేశించడం, గర్బా డ్యాన్సు చేస్తున్న మహిళల్ని వెక్కిరించడం లేకుంటే ప్రేమ పేరుతో మోసం చేయడం వంటి ఘటనలు జరిగాయి.
Sam Pitroda: కాంగ్రెస్ నేత, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడుగా భావించే సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో రాజకీయ రచ్చకు కారణమైంది. పొరుగుదేశమైన పాకిస్తాన్‌తో చర్చలకు భారత్ ప్రాధాన్యత ఇవ్వాలని కోరాడు. పాకిస్తాన్‌తో సహా ఈ ప్రాంతంలోని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా భారత విదేశాంగ విధానం ప్రారంభం కావాలని పిట్రోడా అన్నారు.
PM Modi: అస్సాంలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ ఆదివారం దరంగ్ జిల్లాలోని మంగళ్డోయ్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. “కాంగ్రెస్ పార్టీ భారత సైన్యానికి కాదు, పాకిస్థాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులకు, జాతి వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తుంది” అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా అస్సాంను పాలించిందని, కానీ బ్రహ్మపుత్ర నదిపై “కేవలం మూడు వంతెనలు” మాత్రమే నిర్మించిందని విమర్శించారు. అదే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం గత 10 ఏళ్లలో అలాంటి…
Bengaluru: బెంగళూర్ నగరంలో శివాజీనగర్ మెట్రో స్టేషన్ త్వరలో ప్రారంభానికి సిద్ధమైంది. మెట్రో స్టేషన్‌కు ‘‘సెయింట్ మేరీ’’ పేరు పెట్టాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఒత్తిడి చేస్తుండటం తీవ్ర దుమారానికి కారణమైంది. శివాజీ నగర్ మెట్రో స్టేషన్‌కు సెయింట్ మేరీ పేరు పెట్టడం ఏంటని?? బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరాఠా ఐకాన్‌ను ఇది అవమానించడమే అని ఆరోపించింది. ఇది శివాజీ మహారాజ్‌ని అవమానించడమే అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.