పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు షామిర్ పేటలో కలిశారన్నారు. ఒక ఫామ్ హౌస్ లో సీక్రెట్ గా కలిశారని ఆరోపించారు. కేసీఆర్ చెప్పారు కాబట్టే హరీష్, ఈటల కలిశారన్నారు. కాళేశ్వరం కమిషన్ విషయంలో అంత ఒకటే సమాధానం చెప్పాలని మాట్లాడుకున్నారన్నారు. ఈ అంశంపై ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలి? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని వంద సార్లు చెప్పామన్నారు. కవిత బీజేపీ మీద సర్జికల్ సర్జికల్ స్ట్రైక్ చేస్తోందని.. దానిపై బీజేపీ సమాధానం చెప్పాలన్నారు.
అనంతరం భారత్- పాక్ అంశపై స్పందించారు. పాక్ పై యుద్ధం సరిగా చేయక ట్రంప్ కు భయపడి.. విరమించుకున్నారని ఆరోపించారు. ట్రంప్ తలదూర్చేందుకు ఎందుకు అవకాశం ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. యుద్ధంలో సాధించింది ఏంటి? కోల్పోయింది ఏంటి? చెప్పే బాధ్యత కేంద్రం మీద లేదా? అని ప్రశ్నించారు. సమాధానం చెప్పాల్సింది పోయి రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని.. ఇందిరమ్మ గొప్పతనం పార్లమెంట్ రికార్డ్స్ చూసి కిషన్ రెడ్డి మాట్లాడాలని కాంగ్రెస్ చీఫ్ మహేష్‌గౌడ్ అన్నారు. ఇందిరమ్మ అసలు సిసలైన ఉక్కుమనిషి అని కొనియాడారని… సర్జికల్ స్ట్రిక్ సీక్రెట్ దాన్ని కూడా బీజేపీ నాయకులు రాజకీయాల కోసం బయటకి చెప్తున్నారన్నారు.