ఎన్నికలకు మరో మూడు రోజులు ఉండటంతో రాష్ట్రంలో రాజకీయ నేతలు ప్రచారం దూకుడు పెంచారు. ఏకంగా హైకమాండ్ నేతలు తెలంగాణలో పర్యటిస్తూ.. అభ్యర్థులకు మద్దతిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు కవరయ్యేలా పర్యటన షెడ్యూల్ ను రూపొందించుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రేపటి షెడ్యూల్ కూడా ఖరారైంది. రేపు వారు ఎక్కడెక్కడ పర్యటించారో తెలుసుకుందాం.
Read Also: Tiger Reserve: దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్.. కేంద్రం ఆమోదం..
ప్రధాని మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబరు 27న (సోమవారం) విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఉ. 11 గంటలకు మహబూబాబాద్ లో, మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్ లో బహిరంగ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం సా. 4 గం.లకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు.
కేంద్ర హోమంత్రి అమిత్ షా సోమవారం ఉ. 10 గం.లకు హుజురాబాద్ లో బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఉ. 11 గం.లకు పెద్దపల్లిలో రోడ్ షోలో పాల్గొననున్నారు. అనంతరం మంచిర్యాలలో మ. 12:30 గం.లకు జరిగే రోడ్ షోలో పాల్గొననున్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా సోమవారం ఉ. 10 గం.లకు జగిత్యాలలో జరిగే రోడ్ షోలో పాల్గొననున్నారు. ఉ. 11 గంటలకు బోధన్ బహిరంగ సభ, మధ్యాహ్నం ఒంటిగంటకు బాన్సువాడ బహిరంగ సభ, మ. 2.30 గంటలకు జుక్కల్ లో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.