Gopichand: ఇతను ‘పక్కా కమర్షియల్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ఎక్కడ పారేసుకుంటామో, అక్కడే వెదకాలి” అంటారు పెద్దలు. గోపీచంద్ మనసు చిత్రసీమలో పారేసుకున్నాడు. కాబట్టి, అక్కడే తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తపించాడు. చివరకు అనుకున్నది సాధించి, హీరోగా విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మాస్ హీరోగా పలు చిత్రాలలో జనాన్ని అలరించిన గోపీచంద్, ఓ నాటి ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ తనయుడు! టి.కృష్ణ దర్శకత్వంలో అనేక అభ్యుదయ చిత్రాలు రూపొంది విజయం సాధించాయి. వాటిలో ‘ప్రతిఘటన’ చిత్రం మరపురానిది.
తొట్టెంపూడి గోపీచంద్ 1979 జూన్ 12న ప్రకాశం జిల్లా కాకటూరివారి పాలెంలో జన్మించారు. అప్పటికే గోపీచంద్ తండ్రి నాటకాలు వేస్తూ, రాస్తూ సాగుతున్నారు. ఆ పై తన మిత్రుడు మాదాల రంగారావు నిర్మించి, నటించిన చిత్రాలలో టి.కృష్ణ కూడా నటించారు. అలా తండ్రి జీన్స్ కారణంగానే గోపీచంద్ లోనూ నటుడు నిద్రలేచాడని చెప్పవచ్చు.
Also Read
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
గోపీచంద్ అన్న ప్రేమ్ చంద్ కూడా తండ్రి బాటలోనే పయనిస్తూ దర్శకుడు కావాలని కలలు కన్నాడు. ముత్యాల సుబ్బయ్య వద్ద అసోసియేట్ గా పనిచేస్తున్న ప్రేమ్ చంద్ కారు ప్రమాదంలో మరణించారు. ఆ సమయంలో రష్యాలో మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న గోపీచంద్ కు తన చదువు పూర్తి కాగానే చిత్రసీమపై మనసు మళ్ళింది. ఆ విషయాన్ని తన తండ్రికి ఆప్తులైన వారితో చెప్పాడు. టి.కృష్ణ మెమోరియల్ ఫిలిమ్స్ బ్యానర్ పై గోపీచంద్ ను హీరోగా పరిచయం చేస్తూ ఎమ్.నాగేశ్వరరావు ‘తొలివలపు’ చిత్రాన్ని నిర్మించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ సమయంలో దర్శకుడు తేజ తన ‘జయం’ చిత్రంలో గోపీచంద్ కు విలన్ వేషం ఇచ్చాడు. ఆ సినిమాలో గోపీచంద్ నటన అందరినీ అలరించింది.
‘జయం’లో ప్రతినాయకునిగా మార్కులు సంపాదించిన గోపీచంద్ కు తరువాత కూడా తేజ తన ‘నిజం’లో విలన్ గానే అవకాశమిచ్చాడు. అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ, గోపీచంద్ నటునిగా మార్కులు పోగేసుకోగలిగాడు. ఆ తరువాత ఎమ్మెస్ రాజు నిర్మించిన ‘వర్షం’లోనూ మరోమారు ప్రతినాయకునిగా గోపీచంద్ అలరించాడు. ఆ సినిమా ఘనవిజయంతో గోపీచంద్ కు వరుసగా విలన్ వేషాలే వచ్చాయి. అయితే హీరో కావాలన్న అభిలాషతో ఉన్న గోపీచంద్ వాటిలో దేనినీ అంగీకరించలేదు. టి.కృష్ణకు సన్నిహితులైన పోకూరి బాబూరావు, గోపీచంద్ హీరోగా ‘యజ్ఞం’ చిత్రం నిర్మించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత “ఆంధ్రుడు, లక్ష్యం, శౌర్యం” వంటి చిత్రాలలో హీరోగా అలరించాడు గోపీచంద్. అతను కోరుకున్న హీరో స్థానం లభించింది. ఆ పై గోపీచంద్ ను వరుస పరాజయాలు పలకరించాయి. ఆ సమయంలో ‘లౌక్యం’ మంచి విజయాన్ని అందించింది. తరువాత “జిల్, సౌఖ్యం” చిత్రాలు కూడా ఆకట్టుకున్నాయి. “గౌతమ్ నంద, ఆక్సిజన్, పంతం, చాణక్య” చిత్రాలు అంతగా అలరించలేకపోయాయి. నయనతార వంటి స్టార్ హీరోయిన్, అనేక బ్లాక్ బస్టర్స్ తీసిన బి.గోపాల్ కాంబినేషన్ లో గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’లో నటించాడు. ఆ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా విడుదలయింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన గోపీచంద్ ‘సీటీమార్’ అంతగా అలరించలేదు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ అనే చిత్రంలో గోపీచంద్ నటిస్తున్నాడు. ఈ సినిమా జూలై 1న జనం ముందుకు రానుంది. గోపీచంద్ తో “లక్ష్యం, లౌక్యం” వంటి చిత్రాలు రూపొందించిన శ్రీవాస్ దర్శకత్వంలోనూ ఓ సినిమాలో నటించడానికి అంగీకరించాడు. ఈ పుట్టినరోజు తరువాతయినా గోపీచంద్ కోరుకుంటున్న సక్సెస్ ఆయన దరి చేరాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపార లాభాలు, సామాజిక గౌరవం!
-
US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!