Today (12-01-23) Business Headlines: ప్రత్యక్ష పన్నుల వసూళ్లు భేష్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు లక్ష్యానికి అనుగుణంగా కొనసాగుతున్నాయి. 10 నెలల్లో 14 పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ప్రభుత్వం నిర్దేశించుకున్న నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యంలో ఇది 86 పాయింట్ ఆరు ఎనిమిది శాతానికి సమానం. స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లకి సంబంధించి పోయినేడాదితో పోల్చితే ఇది దాదాపు పాతిక శాతం ఎక్కువ.
Bill Gates Financial Support to Africa: ఆఫ్రికా పురోభివృద్ధికి తన వంతు సాయం చేసేందుకు అమెరికన్ బిలియనీర్, మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్‌గేట్స్ ముందుకొచ్చారు. తన సంపదలో కొంత భాగాన్ని ఇందుకు కేటాయించనున్నట్లు మాటిచ్చారు. ఆరోగ్యం మరియు వ్యవసాయ రంగాలకు నాలుగేళ్లలో 7 బిలియన్ డాలర్లు ఖర్చుపెడతానని అన్నారు. ఈ మేరకు ఆయన ఇటీవల నైరోబీలోని పలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలను సందర్శించారు. అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని పరిస్థితులను ప్రత్యక్షంగా చూశారు.
కొవిషీల్డ్ తయారు చేస్తున్న సీరం ఇనిస్టిట్యూట్, బిల్గేట్ ఫౌండేషన్‌పై వెయ్యి కోట్ల దావా చేశారు ఔరంగాబాద్‌కు చెందిన దిలీప్ లునావత్. కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్ కారణంగా తన కూతురు మృతి చెందిందని ఆరోపిస్తూ.. బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో బాంబే హైకోర్టు సీరం సంస్థతో పాటు బిల్‌గేట్స్ ఫౌండేషన్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని అటు కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. భారత్‌తో పాటు ఇతర దేశాలకు 100…
భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్.. కాలానికి అనుగుణంగా భారత ఆరోగ్యరంగం కొత్త పుంతలు తొక్కుతోందని అభినందించారు.. ఆరోగ్య రంగంతో పాటు, డిజిటల్ రంగం కూడా దినదినాభివృద్ధికి అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారంటూ ప్రధాని మోడీని ప్రశంసించారు.. దేశాభివృద్ధిలో ఆరోగ్య, డిజిటల్ రంగాల ముఖ్యపాత్రను గ్రహించి వాటికి సముచిత స్థానం ఇవ్వడం అద్భుతమైన విషయంగా పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో భాగస్వాములు కావడం మా అదృష్టం అంటూ అమృతమహోత్సవ్…
Business Flash: ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ బిల్‌గేట్స్‌ని దాటేశారు. గౌతమ్ అదానీ తాజాగా 4వ స్థానానికి చేరుకున్నారని ఫోర్బ్స్ సంస్థ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్‌గేట్స్ తన సంపదలోని 20 బిలియన్ డాలర్లను దానం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. భారతదేశంలో 200 కోట్ల వ్యాక్సినేషన్లను అందించడంలో మరో మైలురాయిని సాధించినందుకు గానూ అభినందించారు. కొవిడ్ ప్రభావాన్ని తగ్గించినందుకు భారతీయ వ్యాక్సిన్ తయారీదారులు, ప్రభుత్వంతో కొనసాగుతున్న భాగస్వామ్యానికి బిల్‌గేట్స్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా సుదీర్ఘ కాలం మొదటి స్థానంలో కొనసాగాడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఆయన కొత్త దిశను చూపడమే కాకుండా ఐటీతో ప్రపంచ గమనాన్నే మార్చేశాడు. వ్యాపార వ్యవహారాల్లో ఎంత బిజీగా ఉన్నా పుస్తకాలు చదివే అలవాటును బిల్‌గేట్స్ మానుకోలేదు. రెగ్యులర్‌గా రకరకాల పుస్తకాలను ఆయన చదువుతూనే ఉంటారు. అందులో బాగా నచ్చినవి, ఆ పుస్తకాలు చదివితే ప్రయోజనం చేకూరుతుందని నమ్మేవాటిని మనకు సూచిస్తుంటారు. తాజాగా మరికొన్ని పుస్తకాలను ఆయన మనకు సూచించారు.…
ఈనెల 24 నుంచి బయోఏషియా-2022 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ పాల్గొననున్నారు. వర్చువల్‌గా జరిగే ఈ సమావేశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొంటారు. ఆ సమావేశంలో లైఫ్ సైన్సెస్ గురించి బిల్‌గేట్స్‌తో జరిగే చర్చలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా గత రెండేళ్లుగా ఎదుర్కొన్న అనుభవాలు, హెల్త్‌కేర్‌లో కొత్త ట్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యవ్యవస్థను ఎలా బలోపేతం చేయాలన్న అంశాలపై బిల్‌గేట్స్, కేటీఆర్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. Read…
గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.. సంస్థ ఫౌండర్, మాజీ సీఈవో బిల్‌గేట్స్‌పై వచ్చిన లైంగిక వేధింపులపై విచారణకు అమెరికాలోని ప్రముఖ న్యాయ సంస్థ అరెంట్ ఫాక్స్ ఎల్ఎల్పీని నియమించుకుంది. బిల్‌గేట్స్ గురించి మాత్రమే కాదు.. 2019 తర్వాత మైక్రోసాఫ్ట్‌లో పని చేసే పలువురు సెలబ్రిటీలపై ఆరోపణలొచ్చాయి. దీంతో లైంగిక వేధింపులు, లింగ వివక్ష, ఇతర సమస్యలపై కంపెనీ విధానాలను సమీక్షించాలని మైక్రోసాఫ్ట్ బోర్డును వాటాదారులు కోరారు. అందుకే అరెంట్ ఫాక్స్‌ను మైక్రోసాఫ్ట్ నియమించుకుంది.…