Chandrababu Naidu Speech In Khammam Shankaravam Sabha: తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఒక్క టీడీపీకే ఉందని.. ఎందుకంటే తెలంగాణలో ప్రాజెక్టులు తీసుకొచ్చింది, హైదరాబాద్‌ని అభివృద్ధి చేసింది టీడీపీనే అని చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన శంఖారావం సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో తమకు ఒక్క ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ గానీ, ఎంపీ గానీ లేకపోయినా ఇవాళ ఖమ్మం సభకు తరలివచ్చిన ప్రజల్ని చూస్తుంటే ధైర్యం కలుగుతోందన్నారు. తెలంగాణలో చురుగ్గా లేని టీడీపీ నేతలు.. ఈ సభను చూసైనా క్రియాశీలకంగా మారాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో టీడీపీ ఎక్కడా? అని ప్రశ్నించే వాళ్లకు ఖమ్మం సభే సమాధానమని స్పష్టం చేశారు.
Chada Venkat Reddy: బీఆర్ఎస్ విధివిధానాల్ని చెప్పాకే.. నిర్ణయం తీసుకుంటాం
టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని, భవిష్యత్తుకు నాంది పలకబోతోందని చెప్పిన చంద్రబాబు.. నందమూరి తారకరామారావు ఒక వ్యక్తి కాదు, శక్తి అని కీర్తించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి, ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారన్నారు. పటేల్, పట్వారీ వ్యవస్థ రద్దుతో ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం అందించారని.. మండల వ్యవస్థ, సింగిల్ విండో విధానం అమలు చేసి పేదలకు పక్కా భవనాలు నిర్మించి ఇచ్చారని చెప్పారు. తాను కోరుకున్నది అధికారం కాదని, ప్రజల అభిమానమని.. ఎన్నికలు, ఓట్ల కోసం తానెప్పుడూ పని చేయలేదని అన్నారు. తాను వయసులో పెద్దవాడినైనా యువత కంటే ముందు చూపుతో ఆలోచిస్తానని.. ఐటీ రంగం ప్రాధాన్యతను తాను 25 ఏళ్ల క్రితమే గుర్తించానని పేర్కొన్నారు. బిల్ గేట్స్‌ని కలిసి.. భారతీయుల మేధాశక్తి ఎలాంటిదో వివరించానన్నారు. డిజిటల్ సత్తాలో మనతో పోటీ పడేవాళ్లు ఎవరూ లేరన్నారు.
Puri Jagannadh: మరో బాంబ్ పేల్చిన పూరి.. ప్రేమికులు రెండు సార్లు అది చేసుకోండి
ఇదే సమయంలో రాష్ట్ర విభజన గురించి చంద్రబాబు మాట్లాడుతూ.. కొందరు చేతకాని వ్యక్తులు ఏపీని మళ్లీ తెలంగాణలో కలిపేస్తామని అంటున్నారని, అది జరిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఏపీ రెండు రాష్ట్రాలుగా మారినా.. తాను వేసిన ఫౌండేషన్నే తెలంగాణలో కొనసాగించారన్నారన్నారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసి, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలన్న ఆశ ఉందన్న ఆయన.. ఏపీలో గాడి తప్పిన పాలనను ఆదుకోవాలని కాంక్షించారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా, కలిసి పని చేస్తే దేశానికే ఆదర్శం అవుతాయన్నారు. 40 ఏళ్లు ఏ ప్రజలైతే తనను ఆశీర్వదించారో.. వారి కోసం జీవితాంతం పనిచేస్తానని చెప్పారు. పార్టీ అవసరమనుకున్న వాళ్లు పార్టీలోకి రావాలని.. మళ్లీ తెలంగాణలో పూర్వవైభవం తీసుకురావాలని చంద్రాబాబు కోరారు.