Bill Gates : ఆయన ప్రపంచ కుబేరుల్లో ఒకరు.. ఒక కంప్యూటర్ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు.. ఆయన గురించి తెలియని వారు చాలా తక్కువ మందే ఉంటారు. అతనే మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్ గేట్స్. బిల్ గేట్స్ తన అభిప్రాయాలను తనకు నచ్చిన విషయాలను ప్రజలతో పంచుకుంటూ ఉంటారు. కొత్త కొత్త విషయాలను సైతం షేర్ చేసుకుంటారు. యూట్యూబ్ సహా వివిధ సోషల్ మీడియాలో వీడియోలు, వ్యాసాలు, ఇంటర్వూ్‌యలు ఇలా వివిధ రకాలుగా తన ఫాలోవర్లకు కొత్త సమాచారాన్ని అందజేస్తుంటారు. ప్రధానంగా వ్యాక్సినేషన్, అంటువ్యాధులపై ఆయన ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే టెక్నాలజీలో వస్తున్న మార్పులు వాటి ప్రభావంపై కూడా మాట్లాడుతుంటారు. ప్రతి ఏడాది వేసవి ముందు కొన్ని పుస్తకాల జాబితాను బిల్ గేట్స్ బ్లాగ్ ద్వారా షేర్ చేస్తారు. అయితే ఈసారి పుస్తకాలతోపాటు వెబ్ సిరీస్‌లు, పాటల జాబితాను కూడా పంచుకున్నారు.
Also Read : Bhatti vikramarka: బీఆర్ఎస్ పాలనకు ఇక రెండు నెలలే ట్రైం..!
పుస్తకాలకు సంబంధించి.. టుమారో, అండ్ టుమారో, అండ్ టుమారో.. ఈ పుస్తక రచయిత గాబ్రియెల్ జెవిన్. ఇది ఒక నవల. ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఆడుతూ పెరిగిన ఇద్దరు మిత్రుల కథ. కాలేజీకి వచ్చేసరికి వారు సొంతంగా గేమ్స్ ను రూపొందించడం ప్రారంభిస్తారు. ఈ పుస్తకం తన చిన్ననాటి స్నేహితుడు పాల్ అలెన్‌తో గడిపిన రోజులను గుర్తు చేసిందని బిల్ గేట్స్ తెలిపారు. మైక్రోసాఫ్ట్ స్థాపన, ఆ సమయంలో ఇరువురు చేసిన కృషిని ఈ పుస్తకం జ్ఞప్తికి తెచ్చినట్టు చెప్పారు. గత ఏడాది వచ్చిన గొప్ప పుస్తకాల్లో ఇదొకటన్నారు.
Also Read : Narayana Murthy: ఇన్ఫోసిస్ ద్వారా నారాయణ మూర్తి ఫ్యామిలీ ఎంత సంపాదిస్తుందో తెలుసా..?
బోర్న్ ఇన్ బ్లాక్‌నెస్.. ఈ పుస్తకం ఆఫ్రికా దేశాల చరిత్రను తెలియజేస్తుందని బిల్ గేట్స్ తెలిపారు. దీని రచయిత పేరు ఫ్రెంచ్. వాస్తవానికి ఐరోపావారు ఆఫ్రికాకు రావడానికి ముందే వివిధ ఆఫ్రికన్ రాజ్యాలు పాలన, సైనిక శక్తి, వాణిజ్యం, కళ, పరిశోధనల పరంగా యూరప్‌కు పోటినివ్వగలిగే నగరాలను స్థాపించాయని ఆయన వివరించారు. ఈ పుస్తకం చదివిన తరువాత మరింత తెలుసుకోవాలనే ఉత్సుకత తనలో కలిగినట్టు బిల్ గేట్స్ తెలిపారు.
Also Read : Mani Ratnam Ilayaraja: ఒకే రోజు పుట్టిన ఇద్దరు లెజెండ్స్…
వెబ్ సిరీస్ గురించి.. బోర్గెన్.. ఇది అమెరికాలో నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్నట్టు బిల్ గేట్స్ వెల్లడించారు. ఇది ఒక డానిష్ పొలిటికల్ డ్రామా. క్లిష్ట రాజకీయ పరిస్థితులను అక్కడి తొలి మహిళా ప్రధాని ఎలా అధిగమించారో దీంట్లో చూపించారు. రాజకీయ సంకీర్ణాలు ఎలా ఏర్పడతాయి? ఎలా ముందుకెళ్లాయో చక్కగా చూపించినట్టు బిల్ గేట్స్ తెలిపారు. రాజకీయాలు, కూటముల ఏర్పాటు, నాయకత్వంలో ఉన్న సవాళ్లు, విజయాలపై ఆసక్తి ఉన్నవాళ్లు దీన్ని చూడాలన్నారు.
Also Read : YSR Bima: వైఎస్సార్ బీమా నమోదు ప్రక్రియ ప్రారంభం.. వారికి రూ.5లక్షల సాయం
పాటల జాబితా..హాలిడే, ఫీల్స్ దిస్ గుడ్, ఫీలింగ్ గుడ్, ఆన్ ది సన్నీ సైడ్ ఆఫ్ ది స్ర్టీట్, షూ బీ డూ బీ డూ డా డే, ది విండ్ క్రైస్ మేరీ, లీన్ ఆన్ మీ, ఇట్స్ ఏ న్యూ డే, దిస్ లవ్, లేడీ, బైలాండో.. ఇంగ్లీష్ వెర్షన్, డోంగ్ ఫేడ్ సహా మొత్తం 34 పాటలను బిల్ గేట్స్ షేర్ చేశారు. వీటిలో కొత్త పాటలు మిళితమై ఉన్నట్టు చెప్పారు. ఇవన్నీ స్పోటిఫైలో అందుబాటులో ఉన్నాయి. బిల్ గేట్స్ సూచించిన మొత్తం పాటల జాబితా గేట్స్ నోట్స్ బ్లాగ్‌లో అందుబాటులో ఉంది