Bill Gates Financial Support to Africa: కావాలి ఇంకా.. అంటున్న ఆఫ్రికా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bill Gates Financial Support to Africa: ఆఫ్రికా పురోభివృద్ధికి తన వంతు సాయం చేసేందుకు అమెరికన్ బిలియనీర్, మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్‌గేట్స్ ముందుకొచ్చారు. తన సంపదలో కొంత భాగాన్ని ఇందుకు కేటాయించనున్నట్లు మాటిచ్చారు. ఆరోగ్యం మరియు వ్యవసాయ రంగాలకు నాలుగేళ్లలో 7 బిలియన్ డాలర్లు ఖర్చుపెడతానని అన్నారు. ఈ మేరకు ఆయన ఇటీవల నైరోబీలోని పలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలను సందర్శించారు. అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని పరిస్థితులను ప్రత్యక్షంగా చూశారు. అలాగే.. వైద్య మరియు వ్యవసాయ పరిశోధన సంస్థలకు, పంట పొలాలకు వెళ్లారు.
ఈ రెండు సెక్టార్ల ప్రోగ్రెస్ దిశగా వాస్తవానికి ఏం అవసరమో, ఏమేం ఆటంకాలు ఎదురవుతున్నాయో క్షేత్ర స్థాయిలో గమనించారు. అయితే.. ఆ ఖండం డెవలప్ కావటానికి బిల్ గేట్స్ ఇచ్చే నిధులు ఏ మూలకూ సరిపోవు. ఎందుకంటే.. నిజంగా అవసరమైన మొత్తం బడ్జెట్‌లో ఆయన ఇచ్చేది కేవలం 5 శాతమే. ఆఫ్రికాకు బిల్‌గేట్స్ చేసే దానం కన్నా కనీసం 20 రెట్లు ఎక్కువ ఫండ్స్ అవసరం. ఐక్య రాజ్య సమితి అంచనా ప్రకారం ఆ ప్రాంత ఆరోగ్య రంగంలో నెలకొన్న ఫైనాన్సింగ్ లోటు 66 బిలియన్ డాలర్లు. జీడీపీలో 15 శాతం నిధులు కేటాయించాలన్న అబుజా డిక్లరేషన్‌ని కేవలం 3 ఆఫ్రికా దేశాలు మాత్రమే పాటిస్తున్నాయి.
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!
- Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!
- Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !
read more: L & T Company: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్
అధికాదాయ దేశాలు ఆరోగ్యానికి 4 వేల డాలర్లకు పైగా తలసరి ఖర్చుపెడుతుండగా ఆఫ్రికన్ కంట్రీస్ కేవలం 8 డాలర్ల నుంచి 129 డాలర్ల వరకు మాత్రమే వెచ్చించగలుగుతున్నాయి. సబ్ సహారా ఆఫ్రికాలోని వ్యవసాయ రంగానిదీ ఇదే పరిస్థితి. 74 పాయింట్ 5 బిలియన్ డాలర్లల ఫండింగ్ గ్యాప్ నెలకొంది. దీంతో.. హెల్త్ అండ్ అగ్రికల్చర్.. ఈ రెండు సెక్టార్లకు కలిపి ఏటా 140 బిలియన్ డాలర్లకు పైగా నిధుల కొరత వేధిస్తోంది. బిల్‌గేట్స్ ఇచ్చేది మాత్రం 7 బిలియన్ డాలర్లే. దీన్నిబట్టి ఆఫ్రికా ఖండానికి ఇంకెంత డబ్బు కావాలో అర్థంచేసుకోవచ్చు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!