Anand Mahindra: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాతో తన అధికారిక పర్యటన సందర్భంగా ఈరోజు భేటీ అయ్యారు. అంతకుముందు ముంబైలోని ఆర్‌బీఐ కార్యాలయంలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌తో సమావేశమైన ఆయన పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశాన్ని ఆనంద్ మహీంద్రా తన అధికారిక ట్విట్టర్ లో ధృవీకరించారు. వారి భేటీ ఐటీ వ్యాపారం గురించి కాదని.. సామాజిక చైతన్యం పై చర్చలు జరిగినట్లు ఆయన చెప్పారు.
Read Also: Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ @50.. బర్త్ డే గిఫ్ట్‌గా భారీ విగ్రహం
గేట్స్ తన పుస్తకాన్ని ఆటోగ్రాఫ్ చేసి ఇస్తున్న ఫోటోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. క్యాప్షన్‌లో, అతను ఆటోగ్రాఫ్ ఇచ్చినట్లు రాశారు. “@BillGatesని మళ్లీ చూడడం ఆనందంగా ఉంది. మా బృందాల మధ్య సంభాషణ మొత్తం IT లేదా ఏదైనా వ్యాపారం గురించి కాదు.. సామాజిక చైతన్యాన్ని పెంచడం కోసం మేము ఎలా కలిసి పని చేయవచ్చు అనే దాని గురించి.” అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
Read Also: Gold Mines : ఒడిశాలో గోల్డ్.. తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత
భారతదేశం తనకు భవిష్యత్తుపై ఆశను కలిగిస్తోందని ‘మై మెసేజ్ ఇన్ ఇండియా: టు ఫైట్ క్లైమేట్ చేంజ్, ఇంప్రూవ్ గ్లోబల్ హెల్త్’ అని బిల్ గేట్స్ తన బ్లాగులో పేర్కొన్నారు. బిల్ గేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పేదరికం , పోషకాహార లోపాన్ని తొలగించే లక్ష్యంతో కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్‌ను ప్రారంభించాడు. అతను మైక్రోసాఫ్ట్ సంస్థ యొక్క హెడ్ పోస్ట్ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత ప్రపంచంలోని పలు సమస్య పరిష్కారాలకు సాయం చేసేందుకు తన వంతు తోడ్పాటు అందిస్తున్నారు.