Bill Gates is in love: లేటు వయసులో ఘాటు ప్రేమలో బిల్‌గేట్స్..! ఆమె ఎవరో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bill Gates is in love: బిల్‌గేట్స్ మళ్లీ ప్రేమలో పడ్డారు. ఒరాకిల్ మాజీ సీఈవో, దివంగత మార్క్ హర్డ్ సతీమణి పాలా హర్డ్‌తో ఆయన డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల క్రితం మెలిందాతో విడాకులు తీసుకున్న బిల్‌గేట్స్… ఏడాది నుంచి పాలా హర్డ్‌తో డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఆరు పదుల వయసున్న ఈ జంట ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొని డేటింగ్ వార్తలకు బలం చేకూర్చింది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన బిల్‌గేట్స్ వయస్సు 67 ఏళ్లు.. 2021లో ఆయన భార్య మెలిందా ఫ్రెంచ్ గేట్స్‌తో విడాకులు తీసుకున్నారు. ఇక, పాలా హర్డ్ వయస్సు 60 ఏళ్లు. ఆమె భర్త 2019 అక్టోబర్‌లో క్యాన్సర్ కారణంగా మరణించారు. పాలా హర్డ్‌కు ఇద్దరు కుమార్తెలు. బిల్‌గేట్స్, మెలిందా డేటింగ్‌ను వారి స్నేహితులు కూడా ధృవీకరిస్తున్నారు.
Read Also: Air India: ఎయిర్‌బస్‌తో ఎయిరిండియా భారీ డీల్.. 250 కొత్త విమానాల కోసం ఒప్పందం..?
Also Read
- World's Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
- Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
ఇక, బిల్‌గేట్స్, పౌలా హర్డ్ గత ఏడాది కాలంగా రిలేషన్‌లో ఉన్నట్లు కొన్ని పత్రికలు రాసుకొచ్చాయి.. గత నెలలో ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ సందర్భంగా వీరిద్దరూ కలిసే కనిపించారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని మ్యాచ్‌ను వీక్షించారు.. దీంతో, బిల్ గేట్స్-పౌలా రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని.. వారిది విడదీయలేని బంధం అంటూ.. వారికి సన్నిహితుడైన ఓ వ్యక్తి చెప్పుకొచ్చారు.. అయితే, మార్క్ మరణించిన తర్వాత పాలా హర్డ్ టెక్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆమె ఈవెంట్ ప్లానర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం.. ఇదే సమయంలో పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. మరోవైపు.. దాదాపు మూడు దశాబ్దాల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ 2021లో విడాకులు తీసుకున్నారు బిల్ గేట్స్-మెలిందా దంపతులు. వీరికి 1994లో మ్యారేజ్ జరగగా.. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. కానీ, పెళ్లైన 27 ఏళ్ల తర్వాత అనూహంగా విడిపోయారు.. ఆ తర్వాత మరో లవ్ ట్రాక్ ఎక్కారు బిల్‌గేట్స్.
తాజావార్తలు
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్‌లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!