ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్ జిల్లాలోని పోలీస్ బేస్ క్యాంపుపై నక్సలైట్లు మరోసారి దాడి చేశారు. గత మూడు రోజుల్లో నక్సలైట్లు పోలీసులపై దాడి చేయడం ఇది రెండోసారి. పోలీసు శిబిరంలో కాల్పులు జరిగినట్లు బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ధృవీకరించారు. పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడపల్లి పోలీస్ క్యాంపుపై నక్సలైట్లు దాడి చేశారు.. పోలీసులు, నక్సలైట్ల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు స్వల్ప గాయాలయ్యాయి. బేస్ క్యాంపులో సైనికులకు ప్రథమ చికిత్స చేస్తున్నారు. ఈ…
Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్-బీజాపూర్, దంతేవాడ సరిహద్దు ప్రాంతాల్లో నక్సలైట్లు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు ఎనిమిది నక్సలైట్లు మరణించారు.
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ అడవులు మరోసారి కాల్పులతో దద్దరిల్లాయి. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య బుధవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా, నారాయణపూర్ జిల్లా సరిహద్ద ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు నక్సలైట్లు మరణించారు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మరణించారు.
Chhattisgarh: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. ఛత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్సెస్(సీఏఎఫ్) 4వ బెటాలియన్‌కి చెందిన తిజౌ రామ్ భూర్యను కిరాతకంగా చంపారు. ఇతను కంపెనీ కమాండర్‌గా పనిచేస్తు్న్నాడు. నక్సలైట్లు భూర్యపై గొడ్డలితో దాడి చేశారు. ఈ ఘటన తెలంగాణ సరిహద్దు జిల్లా అయిన బీజాపూర్‌లో చోటు చేసుకుంది.
చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో తన సర్వీస్ రైఫిల్‌తో కాల్చుకుని సీఆర్‌పీఎఫ్‌లోని జంగిల్ వార్‌ఫేర్ యూనిట్ కోబ్రా(కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్) ఇన్‌స్పెక్టర్ శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో బీజాపూర్ జిల్లాలో నక్సల్స్, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బుధవారం బీజాపూర్ జిల్లాలోని బాసగూడ-పామెడ్-యూసర్ ట్రై జంక్షన్ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయని ఐజీ బస్తర్, పి సుందర్‌రాజ్ వెల్లడించారు.
2 Naxals killed in encounter with security forces on Maharashtra-Chhattisgarh border: మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి, చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాల పోలీసులు సంయుక్తంగా ఈ మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఒక మహిళా మావోయిస్టుతో పాటు ఇద్దరు నక్సల్స్ మరణించారు. ఇరు వర్గాల మధ్య ఎన్ కౌంటర్ జరుగుతున్న సమయంలో మరికొంత…
మావోయిస్టులు మరోసారి మెరుపుదాడికి దిగారు.. మావోల దాడిలో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలు కాగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీజాపూర్ జిల్లాలోని కుత్రు పోలీసు స్టేషన్ పరిధిలోని ధర్బా దగ్గర పోలీసు క్యాంపుపై మావోయిస్టులు మెరుపుదాడికి పాల్పడ్డారు.. ఈ ఘటనలో నలుగురు జవాన్లకు తీవ్రగాయాలు అయ్యాయని.. వారిలో ఇద్దరు జవాన్ల పరిస్థితి విషమం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక, పరిస్థితి విషమంగా ఉన్న…