ఛత్తీస్‌ఘఢ్-.బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లాలో ఈ ఎదురు కాల్పులు జరగగా ముగ్గురు మావోయిస్టుల మృతిచెందారు. ఘటనా స్థలం నుంచి ఎస్‌ఎల్‌ఆర్, ఎకె47 రైఫిల్‌లు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్‌లోని తర్లగూడ తెలంగాణ సరిహద్దు లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి వుంది.
మావోయిస్టు కీలక నేతను అరెస్ట్ చేశారు పోలీసులు.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు కీలక నేత మోతీరామ్‌ను అరెస్ట్ చేశారు.. మోతీరామ్‌పై రూ.20 లక్షల రివార్డు ఉన్నట్టుగా చెబుతున్నారు పోలీసులు.. గతంలో సుక్మా జిల్లాలో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను బంధించి.. చంపిన ఘటనలో మోతీరామ్ కీలక సూత్రధారిగా పోలీసులు చెబుతున్నారు. మోతీరామ్‌పై పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు ఉన్నాయి.. కాగా, ఈ మధ్య మావోయిస్టు ఉద్యమానికి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూ వస్తున్నాయి.. ఈ మధ్యే ఖమ్మం…
పోలీసుల కాల్పుల్లో ముగ్గురు గ్రామస్తులు మృతిచెందడం ఛత్తీస్‌గడ్‌లో కలకలం సృష్టిస్తోంది… పూర్తి వివరాల్లోకి వెళ్తే… బీజాపూర్ జిల్లా సిల్గర్ గ్రామంలో పోలీసు బెటాలియన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా 3 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు గ్రామస్తులు.. తమ గ్రామంలో పోలీసు బెటాలియన్ ఏర్పాటు చేయొద్దని నిరసనకు దిగారు.. అయితే.. నిరసన కాస్త ఉద్రిక్తంగా మారిపోయింది… పోలీసులతో గ్రామస్తులు ఘర్షణకు దిగినట్టుగా తెలుస్తుండగా… ప్రతిఘటించడానికి కాల్పులకు దిగారు పోలీసులు.. ఈ ఘటనలో ముగ్గురు గ్రామస్తులు అక్కడిక్కడే మృతిచెందారు.. దీంతో.. గ్రామంలో ఉద్రిక్త…
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న టీకాలను వేగవంతం చేశారు. టీకాలను వేగంగా అందిస్తూ కరోనా కట్టడి చేసేందుకు సిద్ధం అయ్యారు. అయితే, టీకాలపై అవగాహన కలిగిస్తూనే కొన్ని చోట్ల టీకా తీసుకున్న వారికి కొన్ని రకాల గిఫ్ట్ లు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఛత్తీస్ గడ్ లోని బీజాపూర్ మున్సిపాలిటీ వినూత్న నిర్ణయం తీసుకుంది. టీకా తీసుకునే వారికి ఉచితంగా టమోటాలు అందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు, వారిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీజాపూర్…