కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి.. ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత కేంద్రం తీరుపై మండిపడుతున్నారు.. ఒక్కసారి ఎన్నికవగానే ప్రజా ప్రతినిధులు జీవితాంతం పెన్షన్ పొందుతున్నారని… ప్రాణాలు అర్పించేందుకు సైన్యంలో దిగినవారికి పెన్షన్ స్కీమ్ ఎత్తేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. బీహార్‌లో మొదట అగ్నిపథ్‌పై ఆందోళను ప్రారంభం కాగా.. క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి.. సికింద్రాబాద్‌లో ఆర్మీ అభ్యర్థులు నిర్వహించిన ఆందోళన విధ్వంసానికి దారి తీసి హింసాత్మకంగా మారింది..
Read Also: Agnipath Scheme: అగ్నిపథ్ పై స్పందించిన కేంద్రమంత్రులు రాజ్ నాథ్, రాజ్యవర్థన్ సింగ్
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, పరిసర ప్రాంతాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి.. రైళ్లకు నిప్పుపెట్టడం, పరిసరప్రాంతాలను ధ్వంసం చేయడంతో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.. మొదట చేతులెత్తేసిన పోలీసులు.. ఆ తర్వాత మళ్లీ రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు.. గాల్లోకి కాల్పులు జరపడం. రబ్బరు బులెట్లు ఉపయోగించడంతో.. పలువురు గాయాలపాలయ్యారు.. బీహార్‌లో అగ్నిపథ్ ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది.. ఇవాళ బెట్టయ్యాలోని బీహార్ డిప్యూటీ సీఎం రేణు దేవి ఇంటిపై దాడి చేశారు ఆందోళనకారులు.. ఈ దాడిలో ఇళ్లు ధ్వంసం అయ్యింది.. అయితే, ఆందోళనకారులు దాడి చేసినప్పుడు డిప్యూటీ సీఎం రేణు దేవి ఇంట్లో లేరని చెబుతున్నారు.