Bihar: ఈ మధ్యకాలంలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ ఎవరిని పడితే వారిని నిర్ధాక్ష్యణ్యంగా చంపేస్తున్నారు. పట్టపగలు, నడిరోడ్డుపై కూడా హత్యలు చేస్తున్నారు. తాజాగా బీహార్ రాష్ట్రంలోని ఆర్రాహ్ పట్టణంలో దారుణం జరిగింది. అందరి ముందే ఓ ఆగంతకుడు వ్యక్తిపై కాల్పులు జరిపి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
Also Read: Sachin Tendulkar: భారతరత్న తిరిగి ఇచ్చేయాలంటూ సచిన్ ఇంటి ముందు ఎమ్మెల్యే నిరసన
వివరాల్లోకి వెళ్తే..బీహార్ రాష్ట్రంలోని ఆర్రాహ్ పట్టణంలోని ఓ ఆసుపత్రిలో వైద్యం కోసం ఓ వ్యక్తి వచ్చాడు. అతనితో పాటు చాలా మంది రోగులు, ఆసుపత్రి సిబ్బంది కూడా ఉన్నారు. అయితే ఇంతలో ఓ వ్యక్తి తుపాకీ పట్టుకొని ఆసుపత్రిలోకి వచ్చాడు. వెంటనే అక్కడ కూర్చున్న ఓ వ్యక్తిపై కాల్పులు జరిపాడు. అయితే అతడి చేతితో తుపాకీ ఉన్నా ఆసుపత్రి సిబ్బంది ఒకరు అతడిని కొట్టడానికి చూశారు. అతడిని పట్టుకోవడానికి వెంటపడ్డారు. అయితే సదరు వ్యక్తి దొరకకుండా తప్పించుకున్నాడు. అయితే ఆసుపత్రిలోనే ఈ ఘటన జరగడంతో వెంటనే బాధితుడికి వైద్యులు చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. అతడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
ఇక ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించారు ఆసుపత్రి సిబ్బంది. ఎస్సై అనిల్ సింగ్ మాట్లాడుతూ ఆసుపత్రి సిబ్బంది ఫిర్యాదు చేశారని, గాయపడిన వ్యక్తికి చికిత్స అందించినట్లు తెలిపారు. ఈ కేసు విషయంలో మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. నిందితుడి కోసం గాలింపు మొదలు పెట్టామని పేర్కొన్నారు. ఇక ఈ కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన వారు ఆసుపత్రిలోనే ఇలా జరగడం చూస్తుంటే దేశంలో నేరాలు ఏ స్థాయిలో పెరిపోయాయో అర్థం అవుతున్నాయంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిపై మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా ధైర్యంతో అతని వెంట పడ్డారని పొగుడుతున్నారు.
#WATCH | A person was shot by an unknown assailant inside a hospital in Bihar’s Arrah yesterday
Sub-Inspector Anil Singh says, “The injured is being treated. Further investigation is being done.”
(CCTV visuals source: Hospital) pic.twitter.com/Jc3xBiLJ8r
— ANI (@ANI) September 1, 2023