Bihar-UP Weather Alert: బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజలు వేడిగాలుల తాకిడికి అస్వస్థతకు గురవుతున్నారు. ఇప్పటివరకు 100 మందికి పైగా వేడిగాలుల కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
Bihar: దేవుడు ఎవరితో ఉంటాడో వాడికి ఎవరూ హాని చేయలేరు. బీహార్లోని గయాలో ఇది నిజమని తేలింది. అక్కడ 75 ఏళ్ల వృద్ధుడిని గూడ్స్ రైలు ఢీకొట్టింది. కానీ అతనికి గీత కూడా పడలేదు.
కోడలు నిశ్చితార్థాన్ని చెడగొట్టేందుకు తనకు కాబోయే భర్తకు మార్ఫింగ్ చేసిన ఫోటోలు పంపింది ఓ మహిళ. అంతేకాకుండా తన మాజీ ప్రేమికుడి సహాయంతో ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. అనంతరం వారిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు.
CM Nitish Kumar: బీహార్ లోని ‘మహాగటబంధన్’ కూటమిలో లుకలుకలు ఏర్పడ్డాయి. మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీపై ప్రస్తుత సీఎం నితీష్ కుమార్ ఆరోపణలు ఎక్కుపెట్టారు. మాంఝీ కూటమి విషయాలను బీజేపీకి లీక్ చేస్తున్నట్లు ఆరోపించారు. మాంఝీని ముందు ఈ నెల 23న జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో పాల్గొనాలని నితీష్ కోరారు.
బీహార్ లోని సరన్ జిల్లా చాప్రాలో నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో శిశువు జన్మించింది. ఆ పసికందు తల ఆకారం కూడా అసాధారణంగా ఉంది.. అసాధారణంగా జన్మించిన ఆడశిశువును చూసేందుకు నర్సింగ్ హోమ్ కు జనం భారీగా తరలి వచ్చారు.
Bihar: అత్తామామ తీరుతో విసుగు చెంది ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. పెళ్లై నెల రోజులైనా భార్యను తనతో పంపించేందుకు అత్తామామలు అడ్డుచెబుతుండటంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీహార్ ధన్గోన్వా గ్రామానికి చెందిన కృష్ణ కుమార్ గుప్తా నెల రోజుల క్రితం ఏప్రిల్ 14న ఎక్వారి గ్రామానికి చెందిన రీమా కుమారిని వివాహం చేసుకున్నాడు.
బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఈ సంవత్సరం జనవరిలో కనిపించకుండా పోయాడు. అయితే సదరు వ్యక్తి నోయిడాలోని మోమోస్ స్టా్ల్ లో కనిపించాడు. నిశాంత్ కుమార్ అనే వ్యక్తి చనిపోయాడని కుటుంబీకులు అనుకున్నారు. అయితే అతను.. జనవరి 31వ తన అత్తమామల ఇంటికి పెళ్లికి వెళ్తుండగా మిస్సైయ్యాడు.
Crocodile Attack: కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణం. బీహార్ రాష్ట్రంలో 14 ఏళ్ల బాలుడిని ఓ మొసలి చంపి తినేసింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఆ మొసలిని నది నుంచి ఈడ్చుకొచ్చి కసితీరా కర్రలు, రాడ్లతో కొట్టి చంపారు. కొత్త బైక్ కొన్నామనే ఆనందం ఆ కుటుంబంలో ఎంతో సేపు నిలవలేదు. కొత్త బండికి పూజలు చేసేందుకు గంగా నదిలో స్నానం చేసి, గంగా జలాన్ని తీసుకురావాలనుకున్న బాలుడిపై మొసలి దాడి చేసి చంపేసింది.
తన్ రామ్ మాంఝీ కుమారుడు సంతోష్ కుమార్ సుమన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహాకూటమి ప్రభుత్వంలో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో రాజీనామా చేసినట్లు వివరించారు.
Shocking incident: వివాహేతర సంబంధాలకు కారణం మగ లేదా ఆడ లేదా భర్త, భార్య లేదా స్నేహితురాలు ప్రియుడు అనే తేడా లేదు. వైవాహిక జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉంటే.. వెంటనే పక్క దారి మళ్లేందుకు అవకాశాలు ఎక్కువ.