DMK MP Dayanidhi Maran: ఉత్తరాది వాళ్ల గురించి మరోసారి డీఎంకే పార్టీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది. ఉత్తర్ ప్రదేశ్, బీహార్ నుంచి వచ్చే హిందీ మాట్లాడే వాళ్లు తమిళనాడులో టాయిలెట్లు క్లీన్ చేస్తున్నారంటూ.. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు ఆర్జేడీ నేత, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఫైర్ అవుతున్నారు.
BJP: బీహార్ రాజకీయంలో కేంద్రమంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ పార్టీ జేడీయూ, లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీలు త్వరలో విలీనం అవుతాయంటూ కేంద్రమంత్రి శనివారం వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.
బీహార్‌లోని దర్భంగా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (డిఎంసిహెచ్) వైద్యుల మందు పార్టీ చేసుకున్నారు. అయితే అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వైద్యుల మద్యం పార్టీ చేసుకుంటున్న సమాచారంతో.. SSP అవకాష్ కుమార్ ఆదేశాల మేరకు సదరు SDPO అమిత్ కుమార్ నేతృత్వంలో శనివారం సాయంత్రం DMCH అతిథి గృహంలో దాడి చేశారు. అక్కడ గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ గదిలో మూడు విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.…
బీహార్ పోలీస్ సబార్డినేట్ సర్వీసెస్ కమీషన్ (BPSSC) 1,275 సబ్ ఇన్స్పెక్టర్ల పోస్టుల కోసం రిక్రూట్మెంట్ నిర్వహిస్తుంది. అందుకోసం ప్రిలిమినరీ పరీక్ష సమయంలో మోసాలను నిరోధించడానికి కృత్రిమ మేధస్సు (AI)-ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఆదివారం జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు దాదాపు 6.60 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష రెండు షిఫ్టుల్లో అంటే.. ఉదయం, మధ్యాహ్నం జరుగుతుంది.
Bihar: పూజారి దారుణహత్య బీహార్‌లో ఉద్రిక్తతలకు కారణమైంది. ఆరు రోజుల క్రితం కిడ్నాప్ అయిన పూజారిని అత్యంత పాశవికంగా హత్య చేశారు. కళ్లను పొడిచి, జననాంగాలను కోసేసిన స్థితితో మృతదేహం లభించింది. దీంతో ఒక్కసారిగా ఈ హత్య స్థానికుల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. పోలీసులకు, స్థానికులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇద్దరు పోలీస్ అధికారులకు గాయాలయ్యాయి. గోపాల్ గంజ్ జిల్లాలోని దానాపూర్ గ్రామంలో శివాలయంలో పూజారిగా పనిచేస్తున్న మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఆరు రోజుల క్రితం కనిపించకుండా…
Adani Group: బీహార్‌లో వివిధ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. గ్రూప్ సిమెంట్ తయారీ, లాజిస్టిక్స్, వ్యవసాయ పరిశ్రమలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టనుంది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించాలనే తన దీర్ఘకాల డిమాండ్‌ను లేవనెత్తారు.
Bihar: బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై 20 ఏళ్ల యువకుడిని దుండగులు హత్య చేశారు. నిందితుడు ముందుగా యువకుడి కళ్లలో కారం చల్లి, ఆ తర్వాత కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. వారణాసిలో చదువుతున్న రాహుల్ కుమార్ అనే యువకుడు ఛత్ వేడుకల కోసం సొంతూరికి వచ్చాడు. హత్య జరిగే రోజు రాహుల్‌కి ఒకరి నంచి ఫోన్ వచ్చింది. పోలీసులు ప్రాథమిక విచారణ సందర్భంగా.. కేఎల్ఎస్ కాలేజీ దగ్గరకు రావాల్సిందిగా రాహుల్‌కి ఫోన్ వచ్చింది.