Pregnancy Scam: గర్భవతిని చేస్తే రూ. 13 లక్షలు ఇస్తామంటూ ఆఫర్.. 8 మంది అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
All India Pregnant Job Agency: బీహార్‌లోని నవాడాలో సైబర్ మోసం పతాక స్థాయికి చేరుకుంది. గర్భం దాల్చలేని మహిళలను గర్భం దాల్చేందుకు ఒక ఏజెన్సీని నడుపుతున్న ముఠాను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మహిళలను గర్భం దాల్చడం కోసం పురుషులకు 13 లక్షల రూపాయల వరకు జాబ్ స్కామ్‌లో బీహార్ పోలీసులు మొత్తం ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేశారు. అయితే, ఈ గ్రూప్ వివిధ సోషల్ మీడియా వేదికగా ‘ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్’గా వర్క్ చేస్తుంది.. ఉద్యోగ సేవలో పాల్గొనమని పురుషులను ఎర వేసింది. ఆసక్తిగల అభ్యర్థులు తొలుత 799 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
Read Also: Hanuman: హనుమాన్ స్టోరీ లైన్ ఇదే.. లీక్ చేసేసిన ప్రశాంత్ వర్మ
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇక, ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అమాయక ప్రజలే టార్గెట్ గా ఈ కేటుగాళ్లు పని చేస్తున్నారు. వారు తెలిసిన వెబ్ సైట్ లో రిజిస్ట్రర్ అయిన తర్వాత వాళ్లకి అమ్మాయిల ఫోటోలు సైతం పంపేవారు. అమ్మాయిని ఎంపిక చేసుకున్న తర్వాత బాధితుడి నుంచి దాదాపు 5 వేల నుంచి 20 వేల రూపాయల వరకు పూర్తి సెక్యూరిటీ మొత్తాన్ని చెల్లించాలని ఈ ముఠా కోరేది.. అమ్మాయి గర్భం దాల్చిన తర్వాత ప్రైజ్ మనీ (లక్షల్లో) చెల్లిస్తానని కూడా ఈ బృందం బాధితులకు చెప్పేది. ఈ మొత్తం నగదు చెల్లింపులు చేసిన తర్వాత ఈ ముఠా పరార్ అయ్యేది.. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: Covid Cases: ఇండియాలో ఇప్పటివరకు 196 సబ్ వేరియంట్ కేసులు నమోదు..
దీనిపై బీహార్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేసింది. ఈ కేసులో కీలక సూత్రధారి మున్నా కుమార్ వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతడికి సంబంధం ఉన్న పలు ప్రాంతాలపై దాడులు చేసిన తర్వాత ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో ప్రధాన నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు అని డీఎస్పీ కళ్యాణ్ ఆనంద్ తెలిపారు. అయితే, అరెస్టైన వ్యక్తులు దేశవ్యాప్తంగా నడుస్తున్న పెద్ద సైబర్ క్రైమ్ సిండికేట్‌లో భాగమని చెప్పారు. ఈ దాడుల్లో తొమ్మిది స్మార్ట్‌ఫోన్‌లు, ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో మరి కొంత మందిని అరెస్టు చేసే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!